Ranabaali Review: ‘రణబాలి’ రివ్యూ.. విజయ్, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా.. - Eenadu
Ranabaali Review: ‘రణబాలి’ రివ్యూ.. విజయ్, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా.. Eenadu
First reported 6 days ago · latest update 1 hour agoRanabaali Movie Review || చిత్రం: రణబాలి; నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక, ఆర్నాల్డ్ ఓస్లూ, ఈశ్వరీరావు తదితరులు; సంగీతం: అజయ్-అతుల్; రచన, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్; నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, టి-సిరీస్; విడుదల: 16-10-2026 (Ranabaali Movie Release Date)
తక్కువ సమయంలోనే అటు యువతరానికీ... ఇటు కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరైన కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఇటీవల కాలంలో ఆయన సినిమాల ఫలితం ఎలా ఉన్నా, ప్రేక్షకుల్లో క్రేజ్‌లో ఏమాత్రం తగ్గలేదు. ‘రణబాలి’ సందడే అందుకు ఉదాహరణ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం (Ranabaali Movie) ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
Ranabaali Movie Story || 1870 కాలం అది. మద్రాస్ ప్రెసిడెన్సీలో తీవ్రమైన కరవు సంభవిస్తుంది. తినడానికి మెతుకు దొరకదు. మరోవైపు ఆంగ్లేయుల అరాచకాలు కొనసాగుతుంటాయి. పన్ను కట్టాలంటూ పండించిన ధాన్యాన్ని పోర్టుల నుంచి తరలిస్తుంటారు. ఆ ప్రాంతానికి కమిషనర్‌గా ఉన్న సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ ఓస్లూ) ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని తరలించి మరో పెద్ద పదవిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలోనే లక్షల మంది ఆకలితో చనిపోతున్నా అసలేమాత్రం లెక్కచేయడు. ఇదంతా శింగనమలని కాపు కాస్తున్న పాలెగాడు బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ)కి తెలుస్తుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? కరవు రాక్షసుడిగా పేరు పడిన హెక్టర్‌ని ఎదిరించే క్రమంలో రణబాలికి ఎదురైన పరిణామాలేంటి?ఈ పోరాటంలో జయమ్మ (రష్మిక) పాత్ర ఏంటి?శింగనమలలో వందల యేళ్ల కిందట జీవసమాధి అయిన భద్రమల్లన్న తాతకు, రణబాలికీ సంబంధం ఏమిటనే విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నా నమ్మకం వాళ్లకు బలుపుగా అనిపిస్తే నేనెందుకు తగ్గాలి?: విజయ్ దేవరకొండ
Ranabaali Review || వెలుగు చూడని చరిత్రని ప్రపంచానికి తెలియజెప్పాలనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమానే ‘రణబాలి’ అని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ వేడుకలో చెప్పారు. బ్రిటిష్ కాలంలో జరిగిన అకృత్యాలు, భారత స్వాతంత్రోద్యమ నేపథ్యం, అందులో పాల్గొన్న మన వీరుల కథలతో ఇప్పటికే పలు భాషల్లో ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. అందుకే, ఈ చిత్రంతో కొత్తగా ఏం చెబుతున్నారు? అనే ఉత్సుకత వ్యక్తం కావడం సహజం. అయితే, తన మాటలకు తగ్గట్టుగానే మన చరిత్ర పెద్దగా చూపించని కోణాన్ని ఈ సినిమాతో పక్కాగా స్పృశించారు దర్శకుడు. 1870 దశకంలో భారతావనిని వెంటాడిన కరవు రక్కసి నేపథ్యాన్ని ఓ మంచి డ్రామాతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందీ చిత్రం. రాయలసీమ వీరుల స్ఫూర్తితో సృష్టించిన కల్పిత పాత్ర శింగనమల బొబ్బిలి రణబాలి తిరుగుబాటు ఈ చరిత్రని ముందుకు నడిపిస్తుంది. చరిత్రకు ఊరి దేవుడు, వీరుడి నేపథ్యాన్ని ముడిపెడుతూ ఈ కథని మలిచిన విధానం చూస్తే... ఓ రచయితగా రాహుల్ (Ranabaali Director)కు వందకు వంద మార్కులు పడతాయి. కొత్త కోణంలోని కథని ఎంచుకున్నప్పటికీ, దాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకు రాలేకపోయారు. ఊహకు తగ్గట్టుగా సాగే కథనం, నిడివి కారణంగా చాలాచోట్ల సినిమాను సాగదీశారనే భావన కలుగుతుంది.
అయితే, కరవును ప్రతిబింబించే ప్రపంచాన్ని సృష్టించడంలో చిత్రబృందం (Ranabaali Cast and Crew) విజయవంతమైంది. కథానాయకుడి పుట్టుక, కారణం, గండం, ఉత్సవాల నేపథ్యం తర్వాత హీరో తెరకు పరిచయమవుతాడు. తొలి పోరాటంతోనే అతడి పాత్రలోని మొరటుదనం, కరకుదనం పూర్తిగా అర్థమయ్యేలా చేశాడు దర్శకుడు. జయమ్మ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రణబాలి, జయమ్మ పాత్రల మధ్య ప్రేమ, భావోద్వేగాలు బాగా పండాయి. పన్ను కోసం ఊరికొచ్చి వేధిస్తున్న ఆంగ్లేయులకు కారం పెట్టి బెదిరించడం, ఓ చిన్న పాపతో ముడిపెట్టి గుత్తి క్యాంప్‌నకు కథానాయకుడు వెళ్లేలా చేయడంలాంటి సన్నివేశాల్లో బలమైన రచన కన్పిస్తుంది.
కథానాయకుడు (Vijay Deverakonda) సవాల్ విసిరే సన్నివేశంతో ప్రథమార్ధం ముగుస్తుంది. ద్వితీయార్ధంలో గుహ నేపథ్యంలో సాగే పోరాటం ఆకట్టుకుంటుంది. ఆ తర్వాతే సినిమాలో వేగం తగ్గిపోతుంది. ఈ కథకి దైవత్వాన్ని జోడించి, కొత్తదనాన్ని తీసుకొచ్చింది చివరి అంకమే. అయితే అంతకుముందు సాగే పోరాట ఘట్టాలే పతాక సన్నివేశాల్ని తలపించడం, ఊహకు తగ్గట్టుగా సాగే మలుపులతో చివరి అంకం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మొత్తంగా చరిత్రని వాణిజ్య కోణంలో చెప్పాలనుకోడంలో రాహుల్ (Director Rahul Sankrityan) కొంతమేర విజయవంతమయ్యారు.
అమ్మాయి పుడితే తనే ఓ పవర్: రష్మిక
Ranabaali Cast and Crew || రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ తీరు ఆకట్టుకుంటుంది. రాయలసీమ పాలెగాడిని తలపించేలాగే ఉంది ఆయన ఆహార్యం. ఆ యాసలో సంభాషణలు పలికిన విధానం బాగుంది కానీ, కొన్ని చోట్ల బిగపట్టి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. జయమ్మ పాత్రలో రష్మిక (Rashmika Mandanna) సహజంగా ఒదిగిపోయారు. వీరి మధ్య పండిన కెమిస్ట్రీ సినిమాపై బలమైన ప్రభావం చూపించింది. విలన్‌గా మమ్మీ ఫేం ఆర్నాల్డ్ ఓస్లూ, కథానాయకుడి తల్లిగా ఈశ్వరీరావు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. మైమ్ మధు, కిశోర్, వినోద్‌సాగర్ తదితర సహాయ నటుల పాత్రలు బాగున్నాయి.
సాంకేతికంగా సినిమా (Ranabaali Movie) ఉన్నతంగా ఉంది. నీరవ్ షా విజువల్స్ సినిమాకి ప్రధానబలం. 1870 దశకం నేపథ్యాన్ని, కరవు నేలని అత్యంత సహజంగా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. అజయ్ - అతుల్ సమకూర్చిన పాటల్లో ఏందయ్యా సామీ, రణబాలి పాటలు మెప్పిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాపై ప్రభావం చూపించింది. ఎడిటింగ్ విభాగం ఇంకొంచెం పనిచేయాల్సిందనిపిస్తుంది. దర్శకుడు రాహుల్ ప్రయత్నం అభినందనీయం. ఆయన ప్రయత్నంలో నిజాయతీ కనిపిస్తుంది. కథని చెప్పడంలో ఇంకాస్త వేగం పెంచుంటే ఫలితం మరోలా ఉండేది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
Citations · 20 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Ranabaali Review: ‘రణబాలి’ రివ్యూ.. విజయ్, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా.. - Eenadu
Ranabaali Review: ‘రణబాలి’ రివ్యూ.. విజయ్, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా.. Eenadu
1 hour agoRanabaali Twitter Review: ‘రణబాలి’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్-రష్మికల సినిమా టాక్ ఎలా... - TV9 Telugu
Ranabaali Twitter Review: ‘రణబాలి’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్-రష్మికల సినిమా టాక్ ఎలా... TV9 Telugu
8 hours agoRanabaali Review: రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి హిట్ కొట్టారా..? - TV9 Telugu
Ranabaali Review: రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి హిట్ కొట్టారా..? TV9 Telugu
2 hours agoRanabaali first review: విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. - Oneindia Telugu
Ranabaali first review: విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. Oneindia Telugu
6 days agoRanabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ - Asianet News Telugu
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ Asianet News Telugu
2 days agoRanabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ.. - Oneindia Telugu
Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ.. Oneindia Telugu
2 days agoRanabaali Critic Review: రణబాలి క్రిటిక్ రివ్యూ.. వార్నీ, విజయ్- రష్మిక జంట ఇలా చేశారా? కళ్ళు తెలేసే రేటింగ్ బాబోయ్ - News18 Telugu
Ranabaali Critic Review: రణబాలి క్రిటిక్ రివ్యూ.. వార్నీ, విజయ్- రష్మిక జంట ఇలా చేశారా? కళ్ళు తెలేసే రేటింగ్ బాబోయ్ News18 Telugu
2 days agoRanabaali Target: రణబాలి మూవీ హిట్ టార్గెట్, విజయ్ దేవరకొండ, రష్మిక ఎంత తీసుకున్నారంటే? - Asianet News Telugu
Ranabaali Target: రణబాలి మూవీ హిట్ టార్గెట్, విజయ్ దేవరకొండ, రష్మిక ఎంత తీసుకున్నారంటే? Asianet News Telugu
1 day agoRanabaali First Review: రణబాలి మూవీ ఫస్ట్ రివ్యూ - Filmibeat Telugu
Ranabaali First Review: రణబాలి మూవీ ఫస్ట్ రివ్యూ Filmibeat Telugu
23 hours agoRanabaali Review: రణబాలి మూవీ ఫస్ట్ రివ్యూ.. విజయ్ దేవరకొండ గట్టెక్కాడా? టాక్ ఏంటంటే? - Asianet News Telugu
Ranabaali Review: రణబాలి మూవీ ఫస్ట్ రివ్యూ.. విజయ్ దేవరకొండ గట్టెక్కాడా? టాక్ ఏంటంటే? Asianet News Telugu
22 hours agoRanabaali Twitter Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్విట్టర్ రివ్యూ ఇదే.. - Oneindia Telugu
Ranabaali Twitter Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్విట్టర్ రివ్యూ ఇదే.. Oneindia Telugu
17 hours agoRanabaali Twitter Review: రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్-రష్మికల సినిమా ఎలా ఉందంటే? - Filmibeat Telugu
Ranabaali Twitter Review: రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్-రష్మికల సినిమా ఎలా ఉందంటే? Filmibeat Telugu
14 hours agoRanabaali Review: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు పండగేనా? ఆడియన్స్ రివ్యూలు ఎలా ఉన్నాయంటే? - V6 Velugu
Ranabaali Review: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు పండగేనా? ఆడియన్స్ రివ్యూలు ఎలా ఉన్నాయంటే? V6 Velugu
8 hours agoRanabaali Movie Review: రణబాలి సినిమా రివ్యూ.. రాయలసీమ యోధుడిగా విజయ్ దేవరకొండ మెప్పించాడా? - Oneindia Telugu
Ranabaali Movie Review: రణబాలి సినిమా రివ్యూ.. రాయలసీమ యోధుడిగా విజయ్ దేవరకొండ మెప్పించాడా? Oneindia Telugu
7 hours agoRanabaali: రణబాలి సినిమాపై నాని స్పెషల్ ట్వీట్.. విజయ్ దేవరకొండ, రష్మిక లుక్స్ చూసి ఏమన్నారంటే.. - News18 Telugu
Ranabaali: రణబాలి సినిమాపై నాని స్పెషల్ ట్వీట్.. విజయ్ దేవరకొండ, రష్మిక లుక్స్ చూసి ఏమన్నారంటే.. News18 Telugu
6 hours agoRanabaali X Review: ‘రణబాలి’కి మిక్స్డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే! - Chitrajyothy
Ranabaali X Review: ‘రణబాలి’కి మిక్స్డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే! Chitrajyothy
6 hours agoRanabaali Review: రణబాలి రివ్యూ.. - NTV Telugu
Ranabaali Review: రణబాలి రివ్యూ.. NTV Telugu
4 hours agoRanabaali Review: రణబాలి రివ్యూ- ఓవైపు కరువు మరోవైపు బ్రిటీషర్స్ అరాచకం- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే? | Hindustan Times Telugu - Hindustan Times
Ranabaali Review: రణబాలి రివ్యూ- ఓవైపు కరువు మరోవైపు బ్రిటీషర్స్ అరాచకం- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే? | Hindustan Times Telugu Hindustan Times
3 hours agoRanabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్.. విజయ్ దేవరకొండ రష్మిక హిట్ కొట్టారా? డీలా పడ్డారా ? - Asianet News Telugu
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్.. విజయ్ దేవరకొండ రష్మిక హిట్ కొట్టారా? డీలా పడ్డారా ? Asianet News Telugu
3 hours agoRanabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ - Filmibeat Telugu
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ Filmibeat Telugu
2 hours ago