శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల కోసం ఆలయ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.
First reported 1 day ago · latest update 4 hours ago
విద్యుత్తు వెలుగుల్లో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి గోపురం
నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. దసరా నేపథ్యంలో రాజరాజేశ్వరి మాత ఆలయం కొత్త శోభ సంతరించుకుంది. విద్యుత్తు దీపకాంతులతో అలంకరించారు. జగజ్జనని రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కుంకుమార్చనలు, చండీహోమాలు, ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే నగరంలోని స్టోన్‌హౌస్‌పేట ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. రంగనాయకస్వామి ఆలయం నుంచి నగర ప్రధానవీధుల్లో మంగళవాయిద్యాల నడుమ భక్తిపారవశ్యంతో తొలిరోజునే ఈ యాత్ర జరగనుంది. మూలాపేట శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర, శ్రీకృష్ణధర్మరాజ దేవస్థానంలో, నెల్లూరు గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి తదితర ఆలయాలు వేడుకకు ముస్తాబయ్యాయి.
ఉత్సవాల్లో భాగంగా శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమివ్వనున్నారు. 11వ తేదీ చండీ అలంకరణ, 12న భవాని, 13న గాయత్రి, 14న అన్నపూర్ణ, 15న గజలక్ష్మి, 16న సరస్వతి, 17న శ్రీకాళికా, 18న శ్రీదుర్గ, 19న మహిషాసురమర్దని, 20న రాజరాజేశ్వరి అలంకరణలు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
నేటినుంచి దేవీ శరన్నవరాత్రులు - Eenadu
నేటినుంచి దేవీ శరన్నవరాత్రులు Eenadu
1 day agoఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభ చూశారా..? - TV9 Telugu
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభ చూశారా..? TV9 Telugu
4 hours agoనేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు - Andhrajyothy
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు Andhrajyothy
1 day ago