Multiple Telugu outlets report sensational political accusations involving vote removal and personal claims
Andhra Jyothy, Sakshi and TV9 Telugu each publish stories alleging controversial accusations: Andhra Jyothy links K.T. Rama Rao to the removal of minority votes under the name “Sir,” Sakshi claims a journalist is pregnant and accuses Rahul Gandhi, and TV9 Telugu reports an actress making sensational allegations. The outlets do not corroborate each other's claims, leading to differing narratives about the individuals involved.
First reported 5 days ago · latest update 22 hours agoసాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దుమారం చెలరేగింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు నిర్వహించిన నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ తనను నెట్టేశారని జర్నలిస్ట్ రిచా పరాశర్ సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల గర్భిణీగా ఉన్న తనని రాహుల్ నెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆమెను బీజేపీ నేతలు పరామర్శించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ, బీజేపీ ఎమ్మెల్యే ఉమంగ్ బజాజ్‌లు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత గురించి, పితృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ... విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్ట్ పట్ల ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి : మనవడితో వాకింగ్.. మాజీ మంత్రి లైఫ్‌లో ట్విస్ట్!
ప్రస్తుతం మూడు నెలల గర్భిణినని చెప్పిన ఆమె, విధి నిర్వహణలో భాగంగా రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నిస్తే ఆయన తనను బలంగా లాగి కింద పడేశారని వాపోయారు.
‘సుప్రీంకోర్టు గేటు వద్ద రాహుల్ గాంధీ బయటకు వచ్చే సమయం కోసం ఎదురుచూశాను. ఆయన మైక్‌ను పక్కకు జరపమని సైగ చేయడంతో నేను వెనక్కి తీసుకున్నాను. కానీ ఇతర జర్నలిస్టులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నా విధుల్లో భాగంగా నేను కూడా రాహుల్‌తో మాట్లాడేందుకు ముందుకు వచ్చా. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రాహుల్ గాంధీ అసహనంతో ముందుకు వచ్చారు. నా చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగారు. అదే సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది నన్ను నెట్టారు. నేను మెట్లపై బోర్లా పడిపోయాను’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.
మరోవైపు, బీజేపీ, మహిళా జర్నలిస్ట్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు తీవ్రంగా ఖండించారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చెప్పినట్లుగా ఎలాంటి ఘటన స్పష్టంగా కనిపించడం లేదని, రాహుల్ గాంధీపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన అబద్ధాలని, ప్రతిపక్షాల పోరాటాన్ని దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారమని కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
ఎన్నికల సంఘం తీరును, ఓటరు జాబితా సవరణలోని లోపాలను ఎత్తిచూపుతూ విపక్షాలు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్,ఆందోళనల వేళ ఈ వివాదం తెరపైకి రావడం రాజకీయంగా మరింత వేడిని రాజేసింది. సుప్రీంకోర్టులో ఈ విషయమై పిటిషన్లు దాఖలవుతున్న తరుణంలో జర్నలిస్ట్ ఆరోపణల ఉదంతం చర్చనీయాంశమైంది.
"Rahul Gandhi Pushed me down" Rahul Gandhi now pushes a female journalist! Rahul Gandhi's behavior are dangerous for Indian Democracy! He pushes journalist, beats his workers with elbow punch, pushes his own Chief Minister. Rahul Gandhi is behaving like a goon! https://t.co/9GtJ36LDHO
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 12, 2026
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
రాహుల్ గాంధీపై గర్భిణీ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు - Sakshi
రాహుల్ గాంధీపై గర్భిణీ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు Sakshi
3 days agoఆ తెలుగు డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు.. సంచలన ఆరోపణలు చేసిన నటి - TV9 Telugu
ఆ తెలుగు డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు.. సంచలన ఆరోపణలు చేసిన నటి TV9 Telugu
22 hours ago‘సర్’ పేరుతో మైనారిటీల ఓట్ల తొలగింపు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు - Andhrajyothy
‘సర్’ పేరుతో మైనారిటీల ఓట్ల తొలగింపు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు Andhrajyothy
5 days ago