అల్లరి నరేష్ నటించిన 'రంభ ఊర్వశి మేనక' చిత్రం విడుదల
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన 'రంభ ఊర్వశి మేనక' చిత్రం విడుదలైన నేపథ్యంలో, ఈ సినిమా కామెడీ మరియు ఫాంటసీ అంశాలపై విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ చిత్రంపై పలు మీడియా సంస్థలు రివ్యూలు మరియు ట్విట్టర్ స్పందనలను ప్రచురించాయి.
First reported 2 weeks ago · latest update 1 week ago
Ramba Oorvasi Menaka review || చిత్రం: రంభ ఊర్వశి మేనక; నటీనటులు: అల్లరి నరేశ్, సురభి, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, రాశిసింగ్, ప్రిషాసింగ్, విష్ణుప్రియ తదితరులు; సంగీతం: చైతన్ భరద్వాజ్; సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి; కళ: బ్రహ్మ కడలి; ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్; నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్; దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ; సంస్థలు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్; విడుదల: 04-09-2026
ఇటీవల పలువురు హీరోలు హిట్ కొడుతూ ఫామ్‌లోకి వచ్చేస్తున్నారు. అల్లరి నరేశ్ కూడా ఆ జాబితాలోకి చేరొచ్చేమో అనే ఆశలు, అంచనాల మధ్య ‘రంభ ఊర్వశి మేనక’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ramba oorvasi menaka movie release date) మరి సినిమా అందుకు తగ్గట్టుగా కథ, కథనాలు ఉన్నాయా? అల్లరి నరేశ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారా?
Ramba Oorvasi Menaka Story || మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) కుటుంబం తరాలుగా రంభ ఊర్వశి మేనక డ్రామా కంపెనీని నిర్వహిస్తుంటుంది. ఆ కుటుంబం దగ్గర ఓ మేజిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్‌పై సరిగ్గా ముగ్గు వేస్తే పైనుంచి రంభ ఊర్వశి మేనక దిగి వచ్చి కోరికలన్నీ తీర్చేస్తారని ఓ నమ్మకం. ఆ బుక్‌నే నమ్ముకున్న కుటుంబం అప్పుల ఊబిలోకి వెళ్లిపోతుంది తప్ప రంభ ఊర్వశి మేనక మాత్రం దిగిరారు. సూరి కూడా అంతే. చిన్నప్పట్నుంచీ హీరో కావాలనేది అతని కల. కానీ, అందుకు తగ్గ ప్రయత్నాలేవీ చేయకుండా, మేజిక్ బుక్ పేరు చెప్పి అందరి దగ్గరా అప్పులు చేస్తుంటాడు. అలా ఊరి నిండా అప్పులు పెరిగిపోయి కష్టాలు చుట్టు ముడతాయి తప్ప ఆ మేజిక్ బుక్ తెరుచుకోదు, ఇంతలో సూరి తల్లి మంచం పడుతుంది. ఆమె ప్రాణాలు దక్కాలంటే రూ.లక్షలు అవసరం అంటారు వైద్యులు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న సూరి మరోసారి మేజిక్ బుక్‌పై ముగ్గు వేస్తాడు. అనూహ్యంగా ఆ బుక్ తెరుచుకుని పైనుంచి రంభ ఊర్వశి మేనక దిగొస్తారు. మరి వాళ్లు సూరి కోరికల్ని తీర్చారా? లేక కొత్త కష్టాల్ని తీసుకొచ్చారా? హీరో కావాలన్న సూరి కల నెరవేరిందా? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Ramba Oorvasi Menaka Review || ఏమాత్రం కొత్తదనం లేని రెగ్యులర్ ఫాంటసీ కామెడీ చిత్రమిది. ఒడిస్సీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్, అమరావతి, ఓజీ... ఇలా ఇటీవల ట్రెండ్ అయిన ప్రతి మాట, అంశం సినిమాలో వినిపిస్తుంటాయి. కొత్త సినిమాలు, వ్యక్తుల్ని గుర్తు చేసే స్పూఫ్‌లు తెరపై దర్శనమిస్తుంటాయి. కానీ, ఆ సన్నివేశాలేవీ ఆశించినంత వినోదాత్మకంగా ఉండవు. ప్రేక్షకులు ఆస్వాదించే వినోదం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించి, అందుకు తగ్గట్టుగా సన్నివేశాల్ని మలిస్తేనే ప్రయోజనం. ఈ సినిమాలోని కథ, కథనం, హాస్య సన్నివేశాల్ని మలిచిన తీరు అంతా పాత పద్ధతుల్లోనే ఉంది. అక్కడక్కడా కొన్ని నవ్వులు పండాయంటే... కథానాయకుడితో పాటు, అనుభవం ఉన్న వీకే నరేశ్, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి తదితర నటులే కారణం.
బలమైన కథ, సంఘర్షణ లేకుండా ఒట్టి మాటలతో ఎన్ని గారడీలు చేసినా ఫలితం పెద్దగా కనిపించదు. మోనోలాగ్‌లతోనూ, పంచ్‌లతోనూ పాత్రలు పేజీలకొద్దీ సంభాషణలు చెబుతుంటాయి. కానీ, వాటి ప్రభావం సన్నివేశంలో ప్రతిబింబించదు. పోనీ సన్నివేశాలైనా కొత్తగా మలిచి, వాటి నుంచి హాస్యం రాబట్టారా? అంటే అదీ లేదు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త పర్వాలేదు. రంభ ఊర్వశి మేనకల దగ్గరకు అల్లరి నరేశ్, వీకే నరేశ్, శ్రీనివాస్‌రెడ్డి భయపడుతూ వెళ్లే సన్నివేశాలు కాస్త నవ్విస్తాయి. నిజమైన హీరోకి అర్థం చెప్పే పతాక సన్నివేశాల్లో సందేశం ఆకట్టుకుంటుంది.
Ramba Oorvasi Menaka Cast and Crew || అల్లరి నరేశ్ (Allari Naresh) తన శైలి కామెడీతో సందడి చేశాడు. ఆయనకి సూరిలాంటి పాత్రలు కొత్త కాదు, ఇలాంటి హాస్యం కూడా కొత్త కాదు. రంభ ఊర్వశి మేనక డ్రామా కంపెనీ (రమ్) సీఈఓగా వీకే నరేశ్ పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. రంభ ప్రేమలో ఉండే బ్యాచిలర్ అయిన ఆయన ద్వితీయార్ధంలో చేసిన సందడి ఆకట్టుకుంటుంది. పరిమళ పాత్రలో శ్రీనివాసరెడ్డి (comedian srinivas reddy) చేసిన సందడీ నవ్విస్తుంది. ఇంద్రుడుగా వెన్నెల కిశోర్, యమధర్మరాజుగా అజయ్, సూరి ఫ్యాన్‌గా కనిపించే రచ్చ రవి పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. కథానాయిక సురభి పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. రంభ ఊర్వశి మేనక పాత్రల్లో రాశిసింగ్, (Rashi singh) విష్ణుప్రియ, ప్రిషాసింగ్ (prisha singh) అందంగా కనిపించారు. సాంకేతిక విభాగాల విషయానికొస్తే పాటలు, నేపథ్య సంగీతంతో పాటు, కెమెరా పనితనం మెప్పిస్తుంది. నందు సంభాషణలు అక్కడక్కడా ప్రభావం చూపించాయి. దర్శకుడు సినిమాని స్పష్టతతోనే తెరకెక్కించారు కానీ, ఆయన రాసుకున్న కథ, కథనాల్లోనే కొత్తదనం లేదు.
Citations · 7 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Ramba Oorvasi Menaka review: రివ్యూ: రంభ ఊర్వశి మేనక.. అల్లరి నరేశ్ ఖాతాలో హిట్ పడిందా? - eenadu.net
Ramba Oorvasi Menaka review: రివ్యూ: రంభ ఊర్వశి మేనక.. అల్లరి నరేశ్ ఖాతాలో హిట్ పడిందా? eenadu.net
1 week agoRamba Oorvasi Menaka Review : రంభ ఊర్వశి మేనక రివ్యూ.. ఫాంటసీ కథతో అల్లరి నరేష్ చేసిన మ్యాజిక్ ఏంటి..? - tv9telugu.com
Ramba Oorvasi Menaka Review : రంభ ఊర్వశి మేనక రివ్యూ.. ఫాంటసీ కథతో అల్లరి నరేష్ చేసిన మ్యాజిక్ ఏంటి..? tv9telugu.com
1 week agoRamba Oorvasi Menaka Movie | అల్లరి నరేశ్ సినిమాకు సెన్సార్ బ్రేక్! - prabhanews.com
Ramba Oorvasi Menaka Movie | అల్లరి నరేశ్ సినిమాకు సెన్సార్ బ్రేక్! prabhanews.com
2 weeks agoRamba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్ తన జోనర్‌లో హిట్ కొట్టాడా? - Asianet News Telugu
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్ తన జోనర్‌లో హిట్ కొట్టాడా? Asianet News Telugu
1 week agoRamba Oorvasi Menaka Twitter Review - రంభ ఊర్వశి మేనక ట్విట్టర్ రివ్యూ: మల్లెపూలకు కొత్త పేరు... ప్రీమియర్స్ - ABP Desam
Ramba Oorvasi Menaka Twitter Review - రంభ ఊర్వశి మేనక ట్విట్టర్ రివ్యూ: మల్లెపూలకు కొత్త పేరు... ప్రీమియర్స్ ABP Desam
1 week agoRamba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ అయ్యిందా? - Asianet News Telugu
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ అయ్యిందా? Asianet News Telugu
1 week agoRamba Oorvasi Menaka Review : రంభ ఊర్వశి మేనక రివ్యూ.. ఫాంటసీ కథతో అల్లరి నరేష్ చేసిన మ్యాజిక్ ఏంటి..? - tv9telugu.com
Ramba Oorvasi Menaka Review : రంభ ఊర్వశి మేనక రివ్యూ.. ఫాంటసీ కథతో అల్లరి నరేష్ చేసిన మ్యాజిక్ ఏంటి..? tv9telugu.com
1 week ago