Recent developments in Telangana's technology, sports, and entertainment sectors
Recent reports highlight various developments in Telangana, including the growth of Hyderabad as a space industry hub and the hosting of major sporting events. Additionally, there is coverage regarding the impact of audience reception on film promotion and the importance of technological education for future generations.
First reported 2 weeks ago · latest update 1 week ago
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా ఆడాలంటే స్టార్ హీరో, భారీ ప్రమోషన్స్, గ్రాండ్ ఓపెనింగ్స్ తప్పనిసరి కాదని మరోసారి నిరూపించింది బాలీవుడ్ చిత్రం ‘హనుమాన్ అంశ్’. ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ భక్తిరస చిత్రం.. తొలిరోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడినా, ఆ తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ‘హనుమాన్ అంశ్’కు మొదటి రోజు పెద్దగా స్పందన రాలేదు. తొలిరోజు ఈ సినిమా సుమారు రూ.10 లక్షల వసూళ్లతో తన ఖాతా తెరిచింది. ఆ తర్వాత కూడా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. 14 రోజులకు మొత్తం నెట్ వసూళ్లు సుమారు రూ.1.48 కోట్లుగా నమోదయ్యాయి. అక్కడితో ఈ సినిమా బాక్సాఫీస్ కథ ముగిసిపోయిందని చాలామంది భావించారు. అయితే ‘హనుమాన్ అంశ్’కు అసలు అదృష్టం మూడో వారంలో మొదలైంది. సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ క్రమంగా మరింత మందికి చేరడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగడం మొదలైంది.
15వ రోజు కేవలం రూ.15 లక్షలతో ఉన్న కలెక్షన్లు.. 16వ రోజుకు ఏకంగా రూ.85 లక్షలకు చేరగా.. 17వ రోజు రూ.2.20 కోట్ల నెట్ వసూళ్లు రావడంతో సినిమా ఒక్కసారిగా రూ.2 కోట్ల డైలీ కలెక్షన్ మార్క్‌ను అందుకుంది. మూడో వారంలోనే ఈ చిత్రం సుమారు రూ.10.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం
ట్రేడ్ గణాంకాల ప్రకారం 24వ రోజు ముగిసే సమయానికి ‘హనుమాన్ అంశ్’ ఇండియా నెట్ కలెక్షన్ సుమారు రూ.40.13 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో ఇండియా గ్రాస్ వసూళ్లు దాదాపు రూ.47.33 కోట్లుగా నమోదయ్యాయి. ఒకప్పుడు రోజుకు లక్షల్లో మాత్రమే కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. ఇప్పుడు రోజుకు కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘హనుమాన్ అంశ్’ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే అంశం సినిమా బడ్జెట్. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా…ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాకు ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రావడం అంటే.. పెట్టుబడితో పోలిస్తే థియేట్రికల్ రిటర్న్స్ భారీ స్థాయిలో ఉన్నట్టే. భారీ స్టార్ కాస్ట్, ప్రచారం లేకుండానే ఈ స్థాయి వసూళ్లు రావడం సినిమాకు కలిసొచ్చిన మౌత్ టాక్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
‘హనుమాన్ అంశ్’ కథ నీమ్ కరోలీ బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఉండటంతో ఒక నిర్దిష్ట ప్రేక్షక వర్గం సినిమాతో బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. సినిమా గురించి ప్రేక్షకులు ఒకరి నుంచి మరొకరికి చెప్పుకోవడం, థియేటర్లలో చూసిన తర్వాత ఇతరులకు సిఫార్సు చేయడం.. క్రమంగా కలెక్షన్లపై ప్రభావం చూపించింది.
24 రోజులకే ఇండియా గ్రాస్ రూ.47.33 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ సినిమా త్వరలోనే రూ.50 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశం కనిపిస్తోంది. కేవలం రూ.10 లక్షల ఓపెనింగ్‌తో మొదలైన సినిమా.. కొన్ని వారాల తర్వాత ఒక్కరోజులోనే రూ.12.75 కోట్ల నెట్ వసూలు చేయడం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ ప్రయాణంలోని అసలు హైలైట్.
మొత్తానికి.. అంచనాలు లేకుండా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా మారింది. తొలి రెండు వారాల నిరాశను వెనక్కి నెట్టి, మూడో వారం నుంచి ఊహించని రీతిలో దూసుకెళ్లిన ఈ సినిమా.. చిన్న సినిమాలకు మౌత్ టాక్ ఎంతటి బలమైన ఆయుధమో మరోసారి చూపించింది.
Citations · 4 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Hanuman Ansh | ప్రేక్షకుల నోటి మాటే బిగ్గెస్ట్ ప్రమోషన్ అని నిరూపించిన సినిమా - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | - prabhanews.com
Hanuman Ansh | ప్రేక్షకుల నోటి మాటే బిగ్గెస్ట్ ప్రమోషన్ అని నిరూపించిన సినిమా - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | prabhanews.com
2 weeks agoతెలంగాణలో స్పేస్ సిటీ.. అంతరిక్ష పరిశ్రమకు హైదరాబాద్ కొత్త కేంద్రం - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in - prabhanews.com
తెలంగాణలో స్పేస్ సిటీ.. అంతరిక్ష పరిశ్రమకు హైదరాబాద్ కొత్త కేంద్రం - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in prabhanews.com
1 week agoవిద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగించాలి - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top St - prabhanews.com
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగించాలి - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top St prabhanews.com
1 week agoక్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ.. మెగా ఈవెంట్స్ అన్నీ మన గడ్డమీదే ! - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu - prabhanews.com
క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ.. మెగా ఈవెంట్స్ అన్నీ మన గడ్డమీదే ! - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu prabhanews.com
1 week ago