Shiva Nirvana: నా పాత్రలు … ఎలా పుట్టాయంటే - Eenadu
Shiva Nirvana: నా పాత్రలు … ఎలా పుట్టాయంటే Eenadu
First reported 1 week ago · latest update 1 week ago
సినిమాలోని పాత్రల్ని వీలైనంత బలంగా, సహజంగా చెప్పగలిగితేనే ఆ సినిమా హిట్ అవుతుందని నమ్మే దర్శకుడు శివ నిర్వాణ. ‘ఇరుముడి’ సినిమాతో విజయాన్ని అందుకుని మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు... తాను తీసిన సినిమాల్లోని పాత్రలూ వాటి వెనకున్న నేపథ్యాన్ని పంచుకుంటున్నాడిలా...
మనుషులే ముఖ్యమని చెప్పాలని...
ఇప్పటివరకూ మతాలూ, కులాలపైన ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా సిద్ధాంతాల వైరుధ్యాలపైన రాసుకున్న కథే ‘ఖుషి’. ఒకరికి దేవుడంటే విపరీతమైన భక్తి. మరొకరికి ఆ నమ్మకం లేకపోగా ఈ కాలంలోనూ ఇవన్నీ ఉంటాయా అని ప్రశ్నించే తత్వం. తెల్లారిలేస్తే జాతకాలూ, పూజలూ అంటూ తిరిగే కుటుంబానికి చెందిన ఆరాధ్య అనే అమ్మాయికీ, నాస్తిక నేపథ్యం నుంచి వచ్చిన విప్లవ్ అనే అబ్బాయికీ మధ్య జరిగే కథే ఇది. నాస్తిక కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి కాస్త మోడర్న్‌గా ఉండాలనుకున్నా. అలాంటి స్వాగ్ విజయ్ దేవరకొండలో కనిపిస్తుంది గనుకే అతడిని హీరోగా ఎంచుకున్నా. ఇక, రెండు కుటుంబాల భావజాలాల మధ్య సినిమా మొత్తం కొనసాగినా చివర్లో ఒకరి నమ్మకాన్ని తక్కువ చేయకుండా మనిషే ముఖ్యమని చెప్పేందుకు ‘సిద్ధాంతాలూ రాద్ధాంతాలూ కాదు మనిషిగా గెలిచామా లేదా అన్నదే ముఖ్యం’ అనే డైలాగును రాశా. నాకెంతో ఇష్టమైన సినిమా ఖుషి.
ప్రేమకథనే కొత్తగా...
కాలేజీలో ఉన్నప్పుడు... ఓ వ్యక్తిని ఇష్టపడటం, వాళ్లతోనే భవిష్యత్తును ఊహించుకోవడం మామూలే. కానీ, అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. బ్రేకప్‌లూ సహజం. అలాంటి బ్రేకప్ నేపథ్యం ఉన్న అమ్మాయిని భార్యగా పొందిన అరుణ్ అన్న వ్యక్తి పాత్రే ఆది పినిశెట్టిది. ఆ బ్రేకప్ తర్వాత త్వరగా మూవ్ కాలేని మాజీ ప్రియుడిని- ఇంటికే తీసుకొచ్చి మారుస్తానని భార్య చెబితే... అరుణ్ పడే సంఘర్షణే ‘నిన్ను కోరి’ నేపథ్యం. రొటీన్‌గా జరిగే ట్రయాంగిల్ ప్రేమకథనే కాస్త భిన్నంగా చెప్పాలనిపించింది.
ఆ సంఘర్షణ నుంచే...
మా ఊళ్లో అయ్యప్పస్వామి గుడి ఉంటుంది. కార్తికమాసం రాగానే పొద్దున్నే అయిదుగంటల నుంచీ అయ్యప్ప మంత్రాలూ, పాటలూ వినిపిస్తాయి. మంచు కురిసేవేళ నల్లని వస్త్రాలు ధరించి, స్వామి శరణం అనుకుంటూ వాళ్లు వచ్చే తీరు నా కళ్ల ముందు ఫ్లాష్ అయ్యిందోసారి. నిజానికి, స్వామి దీక్ష తీసుకునేవారంతా తమకు ఎలాంటి అలవాట్లు ఉన్నా నలభైఒక్క రోజులు పక్కన పెట్టేస్తారు. అలాంటి దీక్షను అనుసరించే వ్యక్తికి... మిగిలిన సమయంలో ఉండే బలహీనతలకీ, అయ్యప్ప దీక్షకీ మధ్య జరిగే సంఘర్షణ నుంచి పుట్టిందే ‘ఇరుముడి’లోని త్రినాథ్ పాత్ర. కూతురి కోసమే ఏటా మాల వేసుకుంటూ, ఆడపిల్లలను బాధ్యతగా చూసుకోవాలనే వ్యక్తిని- ఆ కూతురే ప్రమాదంలో పడినప్పుడు- మాల పేరుతో చేతులు కట్టేస్తే ఎలా ఉంటుందనేది ఇరుముడిలోని రవితేజ పాత్రలో చూపించా.
కుటుంబ విలువ తెలియజేయాలనీ...
మనలో చాలామంది ఉద్యోగాల పేరుతో ఎక్కడ నివసిస్తున్నా మూలాలు మాత్రం ఊర్లోనే ఉంటాయి. అందరం దాదాపుగా ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమే. ఒక స్థాయి వరకూ అంతా కలిసే పెరిగినా... పెద్దయి, పెళ్లిళ్లయ్యాక పిన్ని - బాబాయి, అత్తయ్య - మావయ్య, పెద్దమ్మ - పెదనాన్న.. అనే పిలుపులూ, ఆప్యాయతా కనుమరుగై ‘నీ వాళ్లు, నా కుటుంబం’ అనే తేడా వస్తుంది. అనుబంధాలు భారమవుతాయి. ఆస్తుల విషయంలో గొడవలు మొదలై, అన్నదమ్ములే కొట్టుకుంటారు. ఈ పరిస్థితుల్లోనూ ఆస్తుల కన్నా కుటుంబసభ్యులే కావాలని కోరుకునే ఓ కల్మషం లేని వ్యక్తి గురించి రాసుకున్న పాత్రే ‘టక్ జగదీశ్’లోని నాని చేసిన జగదీశ్ నాయుడు.
ఓసారి చైతన్యగారు ఫోన్ చేసి నాతో కలిసి మంచి లవ్‌స్టోరీ చేయాలని ఉందనడంతో ప్రేమకథనే కొత్తగా చూపించాలనిపించింది. నాకు క్రికెట్ అంటే ఇష్టం. కాలేజీలో ఉన్నప్పుడు ‘దిల్ తో పాగల్ హై’ వంటి హిందీ సినిమాల్నీ ఇష్టంగా చూసేవాడిని. అలాగే, మా ఊళ్లో ఓ మంచి క్రికెట్ క్రీడాకారుడు అనుకున్న స్థాయికి వెళ్లలేక తర్వాత వేరే అమ్మాయిని పెళ్లాడి చిన్న ఉద్యోగం చేస్తూ కనిపించాడు. అలా, క్రికెట్, ఉత్తరాది నేపథ్యం, వన్‌సైడ్ లవ్ వంటివన్నీ మేళవించిందే ‘మజిలి’. ప్రేమలో విఫలమైన పూర్ణ అనే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు చైతన్య. అతనిపైన శ్రావణి అనే అమ్మాయికి ఉన్న ఇష్టం, సముద్రమంత సహనంతో భర్తను మార్చుకునే తీరునూ ఆసక్తికరంగా మలుచుకున్నా.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Shiva Nirvana: నా పాత్రలు … ఎలా పుట్టాయంటే - Eenadu
Shiva Nirvana: నా పాత్రలు … ఎలా పుట్టాయంటే Eenadu
1 week agoShiva Nirvana: అప్పుడు నడుము గిల్లె సీన్ చేయనంది.. తర్వాత బేబీ చూసి షాకయ్యా.. వైష్ణవి గురించి ఇరుముడి... - tv9telugu.com
Shiva Nirvana: అప్పుడు నడుము గిల్లె సీన్ చేయనంది.. తర్వాత బేబీ చూసి షాకయ్యా.. వైష్ణవి గురించి ఇరుముడి... tv9telugu.com
1 week agoShiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్‌తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ - NTV Telugu
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్‌తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ NTV Telugu
1 week ago