T.A.M · The Air Media
← Back to live feed
Weightage 78 3 outlets citing India IN

Fatima Sana: షఫాలీ వర్మ ఔట్‌ తర్వాత పాక్‌ కెప్టెన్‌ చేష్టలు.. ఐసీసీ చర్యలు - Eenadu

Fatima Sana: షఫాలీ వర్మ ఔట్‌ తర్వాత పాక్‌ కెప్టెన్‌ చేష్టలు.. ఐసీసీ చర్యలు Eenadu

First reported 1 week ago · latest update 1 week ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల భారత్‌తో మ్యాచ్‌ (India vs Pakistan)లో షఫాలీ వర్మ వికెట్‌ తీశాక పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా సంబరాలు చేసుకున్న తీరు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వ్యవహార శైలిని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ‘లెవల్ 1’ను ఉల్లంఘించినందుకుగానూ ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.

అదే విధంగా సనా (Fatima Sana) ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా చేరింది. 24 నెలల వ్యవధిలో ఆమెకు ఇది రెండో డీమెరిట్‌ పాయింట్‌ కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు 6న ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒక డీమెరిట్ పాయింట్ పడింది. అంపైర్‌ ఔట్‌ అని ప్రకటించినప్పటికీ క్రీజును వదిలి వెళ్లేందుకు నిరాకరించడంతో ఐసీసీ ఈమేరకు చర్యలు తీసుకుంది.

స్వదేశం కోసం పనిచేయాలంటే భయం: పాక్‌ మాజీ స్టార్

మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఇటీవల భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 55 పరుగులకే కుప్పకూలింది. భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించి దూకుడు మీదున్న షఫాలీ వర్మ 12 పరుగులు చేసి.. ఫాతిమా సనాకు కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వికెట్‌ సమర్పించుకొంది. ఈ క్రమంలో పెవిలియన్‌ వైపు చేయి చూపిస్తూ ఫాతిమా సంబరాలు చేసుకొంది.

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Fatima Sana: షఫాలీ వర్మ ఔట్‌ తర్వాత పాక్‌ కెప్టెన్‌ చేష్టలు.. ఐసీసీ చర్యలు - Eenadu

Fatima Sana: షఫాలీ వర్మ ఔట్‌ తర్వాత పాక్‌ కెప్టెన్‌ చేష్టలు.. ఐసీసీ చర్యలు Eenadu

1 week ago
84 Sakshi

Sana Fatima: పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాపై ట్రోలింగ్స్ - Sakshi

Sana Fatima: పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాపై ట్రోలింగ్స్ Sakshi

1 week ago
79 NTV Telugu

Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా! - NTV Telugu

Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా! NTV Telugu

1 week ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app