Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట.. - Chitrajyothy
Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట.. Chitrajyothy
First reported 1 week ago · latest update 1 week ago
ABN, Publish Date - Sep 08 , 2026 | 10:32 AM
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్, మార్ఫింగ్ వంటి నకిలీ కంటెంట్ వేదిక విపరీతంగా వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
కృత్రిమ మేధ (ఏఐ-AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్, మార్ఫింగ్ వంటి నకిలీ కంటెంట్ వేదిక విపరీతంగా వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ తారల ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హీరోయిన్ శ్రుతిహాసన్‌కు (Shruthi Haasan) బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏఐ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు ఎడిట్ చేసిన వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆ కంటెంట్ వల్ల తన ప్రతిష్ట, గుడ్‌విల్‌కు నష్టం కలుగుతోందని పేర్కొంటూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవ్ జమ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏఐ ద్వారా రూపొందించే కృత్రిమ కంటెంట్ ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్ట, గుడ్‌విల్, ప్రజల్లో ఉన్న ఇమేజ్‌కు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రతిష్టకు కలిగే నష్టాన్ని కేవలం డబ్బుతో భర్తీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక సెలబ్రిటీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్, వ్యక్తిగత గౌరవం, విశ్వసనీయత అనేవి ఎన్నో సంవత్సరాల కృషితో ఏర్పడతాయని కోర్టు పేర్కొంది. ఫేక్ వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం వల్ల ఆ గుర్తింపుకు నష్టం కలిగితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రుతిహాసన్‌కు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు, ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలు, నకిలీ కంటెంట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది.
ALSO READ: Sardar 2: కమల్‌కు భారతీయుడు.. కార్తీకి సర్దార్!
బాలయ్యకి విలన్లుగా మారుతున్న కుర్ర హీరోలు..
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రవి మోహన్- కేనీషా
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట.. - Chitrajyothy
Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట.. Chitrajyothy
1 week agoShruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట.. - Chitrajyothy
Shruti Haasan: ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై శ్రుతిహాసన్‌కు భారీ ఊరట.. Chitrajyothy
1 week agoShruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట! - NTV Telugu
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట! NTV Telugu
1 week ago