BRICS సదస్సు: చైనా ప్రతిపాదనలు మరియు బంగ్లాదేశ్ అసంతృప్తి
BRICS సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూటమి బలోపేతానికి 'పంచ సూత్రాలను' ప్రతిపాదించారు. మరోవైపు, భారత్ తమ ప్రధానిని సరిగ్గా ఆహ్వానించలేదని బంగ్లాదేశ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
First reported 4 days ago · latest update 1 day ago
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సుకు తమ ప్రధాని తారిక్ రెహమాన్ హాజరుకావడం లేదని బంగ్లాదేశ్ (Bangladesh) తెలిపింది. తమ ప్రధానిని భారత్ సరిగా ఆహ్వానించలేదని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ పేర్కొన్నారు. ప్రధాని హోదాలో కాకుండా.. బిమ్‌స్టెక్ (BIMSTEC) ఛైర్మన్‌గా ఆయనకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.
‘‘బ్రిక్స్ సదస్సు (BRICS Summit)కు ఎలా వెళ్తాం? మా ప్రభుత్వం నుంచి ఎవరినైనా ఆహ్వానించారా? మా ప్రధానిని పిలవలేదు. ఆయన్ను ఆహ్వానించారని ఎవరు చెప్పారు?’’ అంటూ మీడియాతో మాట్లాడుతూ హుమాయున్ ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రధాని తొలి భారత పర్యటన.. అనేక దేశాలు భాగమయ్యే కార్యక్రమంలా ఉండదన్నారు. ద్వైపాక్షిక పర్యటనలు, చర్చలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు, పరస్పర గౌరవంతో కూడిన పరిస్థితుల్లో ద్వైపాక్షిక పర్యటన జరుగుతుందని, దీనికి అంత తొందరేమీ లేదని వ్యాఖ్యానించారు.
భారత సంతతి ట్రక్కు డ్రైవర్లపై.. అమెరికా విద్వేష పోస్టర్
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య 1996 నాటి గంగా జలాల పంపిణీ ఒప్పందం గడువు సమీపిస్తుండటంపై హుమాయున్ స్పందిస్తూ.. తమ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై మాట్లాడుతూ.. ఈ విషయంలో ద్వైపాక్షిక చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఏమిటీ బిమ్‌స్టెక్?: బంగాళాఖాత ప్రాంత దేశాల మధ్య వివిధ రంగాల్లో ఆర్థిక, సాంకేతిక సహకార సాధనా సంస్థను ‘బిమ్‌స్టెక్’గా వ్యవహరిస్తున్నారు. 1997లో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లతో ఇది ఏర్పడింది.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
BRICS Summit: మా ప్రధానిని భారత్ సరిగా ఆహ్వానించలేదు: బంగ్లాదేశ్ - Eenadu
BRICS Summit: మా ప్రధానిని భారత్ సరిగా ఆహ్వానించలేదు: బంగ్లాదేశ్ Eenadu
4 days agoBRICS Summit latest news - Sakshi Education
BRICS Summit latest news Sakshi Education
4 days agoBRICS Summit | బ్రిక్స్ బలోపేతానికి ‘పంచ సూత్రాలు’ ప్రతిపాదించిన జిన్‌పింగ్ - Namasthe Telangana
BRICS Summit | బ్రిక్స్ బలోపేతానికి ‘పంచ సూత్రాలు’ ప్రతిపాదించిన జిన్‌పింగ్ Namasthe Telangana
1 day ago