Recruitment Notifications Announced for Police Departments in Delhi and Andhra Pradesh
Authorities have released recruitment notifications for police positions in Delhi and Andhra Pradesh for 2026. Reports indicate a significant number of vacancies, including 2,050 posts in Andhra Pradesh, are being opened for applicants.
First reported 1 week ago · latest update 8 hours ago
ఈనాడు, అమరావతి: పోలీసు ఉద్యోగార్థులకు తీపికబురు. రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఎస్‌పీఎఫ్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, పోలీసు కమ్యూనికేషన్స్, ఫోరెన్సిక్ విభాగాల్లో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి సెప్టెంబరు 16న నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిల్లో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులూ ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక రాతపరీక్ష తేదీలు, ఇతర వివరాలతో సమగ్ర షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే రాష్ట్రప్రభుత్వం ఈ నోటిఫికేషన్లు జారీచేసింది. కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు రెండేళ్ల పాటు వయోపరిమితి పెంచింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి... రాష్ట్రంలో చివరిసారిగా 2022 నవంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. వైకాపా ప్రభుత్వం ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించి నియామకం పూర్తిచేయకుండా వదిలేసింది. ఒక్క కానిస్టేబుల్ పోస్టూ భర్తీచేయలేదు. 2024లో కూటమి అధికారంలోకి రాగానే శారీరక కొలతలు (పీఎంటీ), దేహదారుఢ్య (పీఈటీ) పరీక్షలు, తుది రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసింది. ఎంపికైన అభ్యర్థులందరికీ గతేడాది చివర్లో శిక్షణకు పంపించింది.
తాజాగా వీరి శిక్షణ ముగిసింది. త్వరలో పాసింగ్ అవుట్ పెరేడ్ పూర్తిచేసుకుని విధుల్లో చేరనున్నారు. ఇప్పుడు మరోసారి పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి పోలీసు నియామక ప్రక్రియ చేపడుతోంది. అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్, జైళ్లశాఖలో వార్డర్ పోస్టుల భర్తీకి 2018లో తెదేపా అధికారంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత తెదేపా నేతృత్వంలోని ప్రభుత్వమే ఆయా శాఖల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
యూపీఎస్సీ ఎన్‌డీఏ -2 ప్రాథమిక కీ విడుదల
ప్రాథమిక రాత పరీక్ష ఏయే పోస్టులకు... • సివిల్, ఏఆర్ విభాగాల్లోని కానిస్టేబుళ్లు, ఫైర్‌మెన్, జైలు వార్డరు పోస్టులకు, సివిల్ ఎస్సై, ఏఆర్ ఆర్‌ఎస్సై, ఎస్‌పీఎఫ్‌లోని ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాతపరీక్ష ఉంటుంది. • పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో మెకానిక్, డ్రైవర్ పోస్టులకు, పోలీసు కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్ట్స్ విభాగాల్లోని ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాతపరీక్ష లేదు. • మెకానిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ట్రేడ్‌టెస్ట్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి డ్రైవింగ్ టెస్ట్ ఉంటాయి. • ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధిస్తే శారీరక కొలతలు (పీఎంటీ), దేహదారుఢ్య (పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హులకు తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. • ప్రాథమిక రాతపరీక్షలు లేని పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి నేరుగా పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హులకు రాతపరీక్ష నిర్వహించి ఎంపికచేస్తారు.
కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు..
వయోపరిమితి • సివిల్, ఏఆర్, పోలీసు కమ్యూనికేషన్స్ విభాగాల్లో కానిస్టేబుల్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో మెకానిక్ పోస్టులకు 18-24 మధ్య వయసుండాలి. 2002 జులై 2 తర్వాత, 2008 జులై 1 కంటే ముందు జన్మించి ఉండాలి. • పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్ పోస్టులకు: 18-27 ఏళ్ల మధ్య వయసుండాలి. 1999 జులై 2 తర్వాత... 2008 జులై 1 కంటే ముందు జన్మించి ఉండాలి. • ఫైర్‌మెన్, జైలు వార్డరు పోస్టులకు: 18-32 మధ్య వయసుండాలి. 1994 జులై 2 తర్వాత, 2008 జులై 1 కంటే ముందు జన్మించి ఉండాలి. • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లోని అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
విద్యార్హతలు • సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, ఫైర్‌మెన్ పోస్టులకు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివి పరీక్షలు రాస్తే చాలు జైలు వార్డరు పోస్టులకు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత. పోలీసు కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు: పదోతరగతితో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఏదో ఒక దాంట్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి, లేదా ఎంపీసీ, ఒకేషనల్ కోర్సులతో రెండేళ్ల ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో మెకానిక్: పదోతరగతితో పాటు వైర్‌మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఫిట్టర్ ట్రేడుల్లో ఏదో ఒక దాంట్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ డ్రైవర్ పోస్టులకు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా పదోతరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఫిట్టర్ ట్రేడ్‌లలో ఏదో ఒక దాంట్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. రెండేళ్లకు తక్కువ కాకుండా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
వయోపరిమితి • సివిల్ ఎస్సై, ఏఆర్ ఆర్‌ఎస్సై, ఎస్‌పీఎఫ్, పోలీసు కమ్యూనికేషన్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై పోస్టులకు: 21-27 ఏళ్ల వయసు ఉండాలి. 1999 జులై 2 తర్వాత... 2005 జులై 1 కంటే ముందు పుట్టాలి. • సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు: 44 ఏళ్లు దాటి ఉండకూడదు. 1982 జులై 2 తర్వాత జన్మించి ఉండాలి. • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు
విద్యార్హతలు • సివిల్ ఎస్సై, ఏఆర్ ఆర్‌ఎస్సై, ఎస్‌పీఎఫ్ ఎస్సై పోస్టులకు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండి, డిగ్రీ చదివి ఉంటే చాలు • పోలీసు కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్సై పోస్టులకు: ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, ఐటీల్లో ఏదో ఒక బ్రాంచ్‌లో డిప్లమో/బీటెక్ పూర్తిచేసి ఉండాలి లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌తో ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లమో చేసి ఉండాలి లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తిచేసి ఉండాలి. • పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో ఎస్సై పోస్టులకు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లలో ఏదో ఒక దాంట్లో డిప్లమో పూర్తిచేయాలి.
Citations · 5 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
AP Police Recruitment 2026 : పోలీసు కొలువుల పండగ.. 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు - eenadu pratibha
AP Police Recruitment 2026 : పోలీసు కొలువుల పండగ.. 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు eenadu pratibha
8 hours agoDelhi Police Recruitment 2026 - education.sakshi.com
Delhi Police Recruitment 2026 education.sakshi.com
1 week agoDelhi Police Jobs 2026 - Sakshi Education
Delhi Police Jobs 2026 Sakshi Education
6 days agoSSC Delhi Police SI Recruitment 2026 - Sakshi Education
SSC Delhi Police SI Recruitment 2026 Sakshi Education
2 days agoPolice Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ - NTV Telugu
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ NTV Telugu
1 day ago