భారత్‌లో బ్రిక్స్ సదస్సు 2026 ఏర్పాట్లు మరియు ప్రత్యేక కార్యక్రమాలు
భారతదేశంలో జరగనున్న 2026 బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. అలాగే బ్రిక్స్ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని భారత్ ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసింది మరియు భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో పలు రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగింది.
First reported 4 days ago · latest update 2 days ago
దిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలకు ప్రధాని ఇచ్చిన విందు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
దిల్లీ: బ్రిక్స్ సదస్సుకు హాజరైన దేశాధినేతలకు, అతిథులకు శనివారం రాత్రి ప్రధాని మోదీ భారీ విందు ఇచ్చారు. భారత మండపంలో ఇచ్చిన ఈ విందులో పసందైన వంటకాలకు వడ్డించారు. మిల్లెట్ పులావ్, పన్నీర్ లబదార్, ఖాండ్వీ మిల్లీ, ఖుంబ్ గలౌతీ, గుచ్చి మార్మిక్, షాతూత్ ఫిర్ని వంటివి ఇందులో ఉన్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ విందుకు హాజరుకాలేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఆయన హోటల్‌కు వెళ్లినందున రాలేకపోయారని చైనా అధికారులు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విందుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తదితర నేతలు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీ చేరుకున్న నేపథ్యంలో నగరం శత్రు దుర్భేద్యంగా మారింది. పశ్చిమాసియా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ కీలక నేతలకు భద్రత కల్పించడం భారత బలగాలకు అతి పెద్ద సవాలుగా మారింది. ఇందుకు సంబంధించి అనేక వారాలుగా ముందస్తు సన్నాహాలు, ప్రణాళికా రచన జరిగాయి. రష్యా, చైనా, ఇరాన్ దేశాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన భద్రతా సిబ్బంది స్థానికంగా జరిగిన ఏర్పాట్లను సునిశితంగా పరిశీలించారు.
ప్రముఖుల కోసం విమానాశ్రయాలు, హోటళ్లతోపాటు సదస్సు నిర్వహిస్తున్న భారత మండపం ప్రాంతంలో, నేతలు సంచరించే మార్గాల వెంట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 25వేల మంది భద్రతా సిబ్బందిని, 100 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలను, పారా మిలిటరీ బలగాల నుంచి ఎంపిక చేసిన 10వేల మంది సిబ్బందిని మోహరించారు.
Citations · 8 reports from 4 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
BRICS Summit 2026: బ్రిక్స్ అతిథులకు ప్రధాని భారీ విందు - Eenadu
BRICS Summit 2026: బ్రిక్స్ అతిథులకు ప్రధాని భారీ విందు Eenadu
2 days agoBRICS Summit 2026: జయహో భారత్ - Eenadu
BRICS Summit 2026: జయహో భారత్ Eenadu
2 days agoBRICS Summit 2026: ఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు - tv9telugu.com
BRICS Summit 2026: ఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు tv9telugu.com
4 days agoBRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి? - telugu.asianetnews.com
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి? telugu.asianetnews.com
4 days agoBRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు - NTV Telugu
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు NTV Telugu
4 days agoBRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - NTV Telugu
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు NTV Telugu
4 days agoBRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే.. - NTV Telugu
BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే.. NTV Telugu
3 days agoBRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే - NTV Telugu
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే NTV Telugu
2 days ago