మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. ఆయన మరణం పట్ల రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
First reported 7 hours ago · latest update 6 hours ago
విశాఖపట్నం: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) (Alla Nani) (57) కన్నుమూశారు. విశాఖలో మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఏలూరు నుంచి మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైకాపా తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2017లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ హయాంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా 2019 నుంచి 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఫిబ్రవరి 2025లో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు.
By Andhra Pradesh Dist. Team Updated : 15 Sep 2026 16:16 IST
► Read latest West godavari News and Telugu News
► Follow us on Facebook, Twitter, Instagram & Google News.
Tags : Andhra Pradesh NewsWest Godavari News
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత - Eenadu
Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత Eenadu
7 hours agoAlla Nani: ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని కన్నుమూత! - tv9telugu.com
Alla Nani: ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని కన్నుమూత! tv9telugu.com
7 hours agoAlla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. - ntvtelugu.com
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. ntvtelugu.com
6 hours ago