T.A.M · The Air Media
← Back to live feed
Weightage 88 3 outlets citing India IN

Kayadu Lohar: ఈవ్‌టీజింగ్‌ చేస్తే… రాయితో కొట్టా - Eenadu

Kayadu Lohar: ఈవ్‌టీజింగ్‌ చేస్తే… రాయితో కొట్టా Eenadu

First reported 4 days ago · latest update 2 hours ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

అందం, అభినయంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంటోంది కయాదు లోహర్‌. వరసగా సినిమాలు చేస్తూ, సౌత్‌ ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ... ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. త్వరలో ‘ప్యారడైజ్‌’తో ప్రేక్షకులను పలకరించనున్న ఈ మరాఠీ భామ ముచ్చట్లు...

మాది అసోం... నేను చదివిందీ పెరిగిందీ మాత్రం పుణెలోనే. నాకు పెద్దగా చదువు వచ్చేది కాదు. కానీ, స్టేజ్‌షోలంటే ఇష్టం. స్కూల్లో, కాలేజీలో యాక్టింగ్, డ్యాన్స్‌ ఈవెంట్లలో పాల్గొనేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతో- చిన్నప్పట్నుంచే పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేసేదాన్ని. కాఫీ షాపులో టీలు అందించా. బట్టల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గానూ పనిచేశా. ఐటీ ఉద్యోగం చేస్తుండగా... ఒత్తిడిని తట్టుకోలేక ఒకసారి ఏడ్చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయా.

చిరంజీవి సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది

పదో తరగతిలో ట్యూషన్‌కి వెళ్తుండగా... కొందరు అబ్బాయిలు ఈవ్‌టీజింగ్‌ చేశారు. రెండు రోజులు ఓపిక పట్టినా... వారి ఆగడాలు ఆగలేదు. మూడోరోజూ అలాగే చేయడంతో- కోపంతో ఒకబ్బాయిని రాయితో కొట్టా. అది అతని తలకి తగలడంతో రక్తమొచ్చింది.

‘అల్లుఅర్జున్‌’ నటనంటే ఇష్టం. నేను చూసిన మొదటి సౌత్‌ ఇండియన్‌ మూవీ ‘ఆర్య-2’. చిన్నప్పుడు ఈ చిత్రాన్ని ప్రతివారం చూసేదాన్ని. ఇప్పటికీ మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది.

అదే దుల్కర్‌ సల్మాన్‌ ప్రత్యేకత

ఇండస్ట్రీలోకి రావాలనే మోడలింగ్‌ ప్రారంభించా. ముందు చిన్నచిన్న యాడ్స్‌లో నటించా. ‘ముగిల్‌పేట్‌’ చిత్రంలో మొదటి అవకాశం వచ్చినా... మంచి బ్రేక్‌ రావడానికి మాత్రం దాదాపు నాలుగేళ్లు పట్టింది. ‘డ్రాగన్‌’తో ఒక్కసారిగా గుర్తింపుతోపాటు వరసగా అవకాశాలూ వస్తున్నాయి.

నా కలలను నెరవేర్చుకోవడం కోసం కష్టపడుతున్నా. ఒక్కోసారి సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలూ అనవసరమైన ట్రోలింగూ చేస్తుంటారు. నా విషయంలోనూ అలాంటివి జరిగాయి. ఆ సమయంలో చాలా బాధపడ్డా. అందుకే, కొంతకాలం సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నా.

నాకు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికెళ్లినా... చిన్న స్పీకర్‌ని తీసుకెళ్తా. వివిధ భాషల్లోని ఫేమస్‌ పాటలను వింటూ... అందులోని పదాలకు అర్థాలను తెలుసుకుని, గుర్తుపెట్టుకుంటా. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు- ఆ భాషలోని పాటల్నే ఎక్కువగా వింటా. దాంతో డైలాగ్స్‌ చెప్పడం సులభమవుతుంది.

నాకు ఉదయం కాఫీ, టీ తాగే అలవాటు లేదు. వేడినీళ్ళలో నిమ్మరసం వేసుకుని తాగుతా. మా అమ్మ చేసే పప్పు అన్నంతోపాటు కిచిడీ, పెరుగన్నమంటే ఇష్టం. నేనూ వంట చేస్తా. పప్పు, బటర్‌ చికెన్‌ బాగా వండుతా. ఎన్నిసార్లు ప్రయత్నించినా... రోటీ మాత్రం రౌండ్‌గా రాదు.

ఇంట్లో ఉంటే ఎక్కువ నిద్రపోతా, సినిమాలూ చూస్తా. చీరలు కట్టుకోవడమంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ నేపాల్‌.

ఆ సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధపడతా?

హీరోయిన్లను అసభ్యకరంగా చూపించే సినిమాలను అస్సలు చేయను. కథకూ పాత్రకూ అవసరమని నాకు నమ్మకం కలిగితే, ఓ స్థాయి వరకూ చేయడానికి అంగీకరిస్తా. అంతేకానీ, ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించడం కోసమే అలాంటివి చేయడం మాత్రం నాకిష్టం ఉండదు. ఎప్పటికైనా మణిరత్నం సర్‌ సినిమాలో చేయాలని ఓ చిన్న ఆశ.

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Kayadu Lohar: ఈవ్‌టీజింగ్‌ చేస్తే… రాయితో కొట్టా - Eenadu

Kayadu Lohar: ఈవ్‌టీజింగ్‌ చేస్తే… రాయితో కొట్టా Eenadu

2 hours ago
83 TV9 Telugu

Kayadu Lohar: సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కయాదు లోహర్ - tv9telugu.com

Kayadu Lohar: సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కయాదు లోహర్ tv9telugu.com

4 days ago
79 NTV Telugu

Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్‌! - ntvtelugu.com

Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్‌! ntvtelugu.com

1 day ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app