T.A.M · The Air Media
← Back to live feed
Weightage 87 3 outlets citing General IN

వివిధ అంశాలపై వార్తా కథనాలు

ఈ కథనాలు కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కారణాలు, ఒకే రోజు 13 సినిమాలు ఓటీటీలో విడుదల కావడం, మరియు ఆసియా క్రీడల్లో 13 ఏళ్ల చైనా అథ్లెట్ రికార్డు వంటి విభిన్న అంశాలను ప్రస్తావిస్తున్నాయి. ఇవి ఒకే సంఘటనకు సంబంధించినవి కావు.

First reported 4 days ago · latest update 2 hours from now
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
BBC News Telugu Authority 90

ఈ రోజుల్లో చాలా మందికి కళ్ల కింద నల్లటి వలయాలు(డార్క్ సర్కిల్స్) ఒక సమస్యగా మారాయి.

సరైన నిద్ర లేకపోవడం, అదేపనిగా టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను చూడటం వంటివి దీనికి కొన్ని కారణాలుగా ప్రచారంలో ఉంది.

అయితే దీనికి మరిన్ని కారణాలు ఉన్నాయని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు.

కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయని ఇటీవల కాలంలో కొన్ని క్రీములు ఆన్‌లైన్‌లో కూడా అమ్ముడవుతున్నాయి. అవి ఎంత వరకు పని చేస్తాయనే విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ పరిస్థితిలో, కళ్ల కింద నల్లటి వలయాలను కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే కాకుండా, సౌందర్య సమస్యగా కూడా ప్రజలు పరిగణిస్తున్నారని చర్మవ్యాధి నిపుణురాలు, ప్రొఫెసర్ పి. విజయలక్ష్మి అన్నారు.

కళ్ల కింద నల్లటి వలయాలు, వాటి కారణాలు, చికిత్సల గురించి సాధారణంగా ఉన్న చాలా ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిని స్థూలంగా 4 వర్గాలుగా వర్గీకరించవచ్చు.

మొదటగా, ఇది జన్యుపరమైంది. అంటే కుటుంబంలో తల్లిదండ్రులకు ఇలాంటి సమస్య ఉంటే పిల్లలకు రావచ్చు. ఎన్ని రకాలుగా చికిత్స తీసుకున్నా సరే సమస్య పునరావృతమవుతూనే ఉంటుంది.

రెండోది కళ్ల కింది భాగంలో వాపు వలన వలయాలు ఏర్పడవచ్చు. చుండ్రు వంటి కారణాల వల్ల దురద వస్తుంది. దురద పెట్టే భాగంలో రుద్దినప్పుడు ఆప్రాంతమంతా వాచి డార్క్ సర్కిల్స్‌గా మారేందుకు అవకాశం ఉంది.

మెలనిన్ అనే పదార్థం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ నల్లటి వలయాలు ఏర్పడతాయి. దీన్ని గుర్తిస్తే చికిత్స చేయవచ్చు.

మూడోది, రక్త ప్రసరణలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని రకాల నల్లటి వలయాలు ఏర్పడతాయి. నాలుగోది, వయసు పెరిగే కొద్దీ కళ్ల కింద కణాలు బలహీనపడి నల్లటి వలయాలు ఏర్పడతాయి.

పైన చెప్పిన కారణాల వల్ల తరచుగా నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇలా నల్లటి వలయాలు అనేక కారణాలు వల్ల బాహ్య రూపంలో వచ్చే మార్పు మాత్రమే. దీనికి కారణం ఏంటో తెలుసుకోగలిగితేనే చికిత్స చేయవచ్చు.

నిద్రకు, కళ్ల కింద నల్లటి వలయాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు.

కానీ ఎవరికైనా ఇప్పటికే కళ్ల కింద నల్లటి వలయాలు ఉండి, వారికి తగినంత నిద్ర లేకపోతే, ఆ నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

వారికి తగినంత నిద్ర లేకపోతే, వారి శరీరం డీహైడ్రేట్ అవుతుంది.

ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ సరిగా ఉండదు. అప్పుడు కళ్ల కింద నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

వీటి మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు.

అయితే, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడవచ్చు.

కానీ, దీనికి అదే ప్రధాన కారణమని నేరుగా చెప్పలేం.

ఒక చర్మ వైద్యులు మాత్రమే ఈ విషయాన్ని గుర్తించి చెప్పగలరు. కొన్ని సందర్భాల్లో కంటి కింద గుంత పడినట్లుగా ఉంటుంది.

అటువంటప్పుడు ఫిల్లర్స్ వంటివి ఉపయోగించి సరిచేయవచ్చు. ఎక్కువగా దురద వచ్చినప్పుడు రుద్దడం వల్ల చర్మం మందంగా మారి, పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. దానిని కూడా సరి చేయవచ్చు.

నల్లటి వలయాలు ఉండటం అనేది ప్రమాదకరమైన విషయమేమీ కాదు. అది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే. నల్లటి వలయాలతో కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చు.

అయితే, ముఖం మీద ఉన్న సర్కిల్స్ స్పష్టంగా కనిపించడం వల్ల చాలామంది సొంతంగా ఏదో ఒక చికిత్స ప్రయత్నిస్తుంటారు. ఆ తర్వాత వైద్యులను కూడా సంప్రదిస్తారు.

మెజారిటీ ప్రజలు నల్లటి వలయాల నివారణకు చికిత్స కూడా తీసుకుంటారు.

నల్లటి వలయాలు ఎటువంటి హాని చేయవు. అది చాలా కాలంగా ఉన్నా లేదా ఈ మధ్యే వచ్చినా సరే ప్రమాదం ఏమీ లేదు. దానికి గల కారణాన్ని గుర్తిస్తే చికిత్స అందించవచ్చు.

స్క్రీన్‌లను చూడటం వల్ల కొన్ని కాంతి కిరణాలు కంటిపై పడతాయి. మనం ఎండలోకి వెళ్లినప్పుడు కూడా ఎన్నో కాంతి కిరణాలు మనపై పడతాయి.

ఎండలోకి వెళ్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో, స్క్రీన్‌లను చూసేటప్పుడు కూడా అదే ఉంటుంది.

కానీ, స్క్రీన్‌లను ఎక్కువ సమయం చూడటం వల్ల కళ్లకు ఇబ్బంది కలుగుతుంది.

చర్మానికి నీటి శాతం (హైడ్రేషన్), తేమ అందించడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చర్మ ఆరోగ్యానికి నీరు చాలా అవసరం.

కొన్నిసార్లు చర్మం పొడిబారడం వల్ల ముడతలు పడుతుంది. సరిపడా నీరు అందకపోవడమే దీనికి కారణం.

దోసకాయ వంటి వాటిని ఉంచినప్పుడు అక్కడ చర్మానికి నీటి తేమ లభిస్తుంది. వాటిని నేరుగా కంటి కింద ఉంచినప్పుడు తేమ శాతం పెరుగుతుంది.

కొన్ని రకాల సముద్రపు పాచిని (Seaweeds) కూడా ఉంచవచ్చు. నీటి తేమ పెరిగినప్పుడు నల్లటి వలయాలు కొంతవరకు తగ్గవచ్చు.

ముందుగా చర్మం గురించి తెలుసుకోవాలి. ఏదైనా మార్పు చర్మం లోపలి పొరల నుంచి పైకి రావడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుంది.

మనం తీసుకునే చికిత్సను బట్టి దాని పనితీరు తెలుసుకోవడానికే కనీసం ఒక నెల రోజులు పడుతుంది. దీనికి సంబంధించి కొన్ని క్రీమ్‌లు ఉన్నాయి, కానీ కేవలం కొద్ది రోజుల్లోనే ఫలితాలను ఆశించలేం.

మార్కెట్‌లో దొరికే క్రీమ్‌లను ఉపయోగించడం ఎంతవరకు సురక్షితమో చెప్పలేం. చర్మ వైద్యులు పరీక్షించి, కారణాన్ని తెలుసుకుని సూచించే క్రీమ్‌లను ఉపయోగించడం మంచిది. అంతేకానీ ఇంటర్నెట్‌లో దొరికే క్రీమ్‌లను నమ్మకూడదు.

ఎండలోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ సన్‌గ్లాసెస్, సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. ఒకవేళ జన్యుపరమైన కారణాల వల్ల వస్తే, దానికి తగిన చికిత్సలు తీసుకోవచ్చు.

అయితే, వాటిని క్రమం తప్పకుండా కొనసాగించాలి. మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి.

ఒకవేళ చుండ్రు వల్ల వస్తున్నట్లయితే, క్రమం తప్పకుండా షాంపూ ఉపయోగించడం వంటివి చేసి నల్లటి వలయాలను అదుపులో ఉంచుకోవచ్చు.

అన్ని రకాల కారణాలకూ చికిత్స అందుబాటులో ఉంది. సరైన వైద్య పరీక్షల ద్వారా ముందుగా అసలు కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నల్లటి వలయాలు తగ్గిన తర్వాత కూడా సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలి. చుండ్రు వంటి కారణాలను అదుపులో ఉంచుకోవాలి.

మెలనిన్ ఉత్పత్తికి సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. దానిని తగ్గించడానికి కొన్ని క్రీమ్‌లు ఉన్నాయి. వీటిని వాడటం వల్ల నలుపు రంగు తగ్గుతుంది.

ముడతల కోసం ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి. వయసు పెరగడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి, దానికి ఫిల్లర్లను ఉపయోగించుకోవచ్చు. ఈ నలుపు రంగును సరిచేసే లేజర్ చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కెమికల్ పీల్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా చికిత్స అందించవచ్చు. దాని ద్వారా కూడా నల్లటి వలయాలను అదుపు చేయవచ్చు.

కొన్ని రకాల మందులు ఉన్నాయి, వాటి ద్వారా కూడా నియంత్రించవచ్చు. కానీ ప్రతీదీ అందరికీ సరిపడదు. కాబట్టి ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే చికిత్సను ప్రారంభించాలి.

నల్లటి వలయాలు కొన్ని నిర్దిష్ట కారణాల వల్లే వస్తాయి. ఆ కారణాలు లేకుండా చూసుకుంటేనే నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. నీటి శాతం (హైడ్రేషన్), ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

వయసు పెరగడం వల్ల చర్మంలో వచ్చే మార్పులను తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకు, పండ్లు, పచ్చని కూరగాయల్లో సహజంగానే యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి.

తర్వాత, ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాల నుంచి అమినో ఆమ్లాలు లభిస్తాయి. శాకాహారులు సోయాబీన్స్, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవచ్చు. మాంసాహారంలో సహజంగానే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

విటమిన్ల విషయానికి వస్తే, నీటిలో కరిగే విటమిన్లు చాలా ఉన్నాయి. విటమిన్ సి, బి12 వంటివి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు.

విటమిన్ బి12 మొలకెత్తిన విత్తనాలు, మాంసాహారంలో కాలేయం (లివర్) వంటివాటిలో అధికంగా ఉంటుంది. విటమిన్ సి అనేది నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో సమృద్ధిగా ఉంటుంది.

క్యారెట్, బొప్పాయి వంటి పండ్లలో ‘విటమిన్ ఎ’ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ మొలకెత్తిన విత్తనాల ద్వారా కూడా లభిస్తుంది. చేపలు, గుడ్లు, పాలు వంటి ఆహారాలలో విటమిన్ డి అధికంగా ఉంటుంది.

అలాగే శరీరంలో నీటి శాతం (హైడ్రేషన్) సరిగ్గా ఉండాలి. నీటిని ఎక్కువగా తాగాలి.

ఈ కథనంలో పేర్కొన్న అభిప్రాయాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహా కోసం తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

↗ Read the original at BBC News Telugu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

90 BBC News Telugu ★ most authoritative citation

కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌.. 13 ప్రశ్నలు, సమాధానాలు

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలేంటి? నిద్ర చాలకపోతే వస్తాయా? గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు, నల్లని వలయాలకు సంబంధం ఉందా? కంటిపై దోసకాయ ముక్కలు పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయా? ఎన్నో ప్రశ్నలు.. అన్నిటికీ సమాధానాలు ఈ కథనంలో.

4 days ago
80 Google News Telugu Entertainment

ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..! - Sakshi

ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..! Sakshi

3 days ago
80 Google News Telugu Sports

ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే చైనా అథ్లెట్ రికార్డు - Andhrajyothy

ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే చైనా అథ్లెట్ రికార్డు Andhrajyothy

2 hours from now

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app