Abhishek Sharma scores century in 30 balls during T20I match
Indian cricketer Abhishek Sharma achieved a century in 30 balls during a T20I match. Reports note his performance and celebration style, with some outlets clarifying that while this is a significant milestone, it is not the fastest century in T20I history.
First reported 10 hours ago · latest update 1 hour from now
మూడో టీ20లోనూ భారత్ ఘనవిజయం సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్
అభిషేక్ 108 (34 బంతుల్లో 9×4, 11×6)
టీమ్‌ఇండియాది అదే జోరు. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన శ్రేయస్‌సేన.. మూడో టీ20లో అఫ్గానిస్థాన్‌ను మరింత చిత్తుగా ఓడించి, సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అభిషేకే భారత్ హీరో. సిరీస్ ఆరంభం నుంచి అఫ్గాన్‌ను బౌలర్లను చితక్కొడుతూ వచ్చిన ఈ విధ్వంసకారుడు.. ఆఖరి మ్యాచ్‌లో మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. సిక్స్‌లు, ఫోర్ల మోతతో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసిన అభిషేక్.. కేవలం 30 బంతుల్లో శతక్కొట్టి, భారత్‌కు కొండంత స్కోరును అందించాడు. ఛేదనలో అఫ్గాన్ జట్టు తేలిపోయింది.
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ముగించింది. అభిషేక్ శర్మ (108; 34 బంతుల్లో 9×4, 11×6) చెలరేగిన వేళ.. గురువారం ఏకపక్షంగా సాగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో 127 పరుగుల తేడాతో గెలిచింది. అభిషేక్‌తో పాటు సంజు శాంసన్ (50; 35 బంతుల్లో 2×4, 4×6) మెరవడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గానిస్థాన్ చేతులెత్తేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (3/25), రవి బిష్ణోయ్ (3/26), అక్షర్ పటేల్ (2/9) ధాటికి 14.1 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది.
తేలిపోయిన అఫ్గాన్: భారీ ఛేదనలో అఫ్గానిస్థాన్ చతికిల పడింది. ఏ దశలోనూ పోటీలో లేదు. నాలుగో ఓవర్లో గుర్బాజ్ (15), అటల్ (1)లను ఔట్ చేయడం ద్వారా అక్షర్.. ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. రసూలి (1)ని బుమ్రా, ఇబ్రహీం జాద్రాన్‌ను యశ్ ఠాకూర్ ఔట్ చేయగా.. ఆరో ఓవర్లో 47/4తో నిలిచింది అఫ్గాన్. ఆ జట్టు ఓటమి చాలా ముందే ఖాయమైంది. మిగతా ఆట అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే. నితీశ్, రవి బిష్ణోయ్ చకచకా వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని వేగిరం చేశారు. చివరి ఆరు వికెట్లు వీళ్ల ఖాతాలోనే చేరాయి.
దంచేశారు..: 221/7. అంతకుముందు టీమ్‌ఇండియా చేసిన ఈ స్కోరు పెద్దదే. కానీ ఆరంభం ప్రకారం చూస్తే ఇది చాలా తక్కువే అనుకోవచ్చు. అభిషేక్ విధ్వంసంతో తొలి 10 ఓవర్లలో పరుగుల వరద పారించిన భారత్.. ద్వితీయార్ధంలో ఊపు కోల్పోయింది. భారత్ సిరీస్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగగా, అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శాంసన్‌తో తొలి వికెట్‌కు కేవలం 59 బంతుల్లోనే 142 పరుగులు జోడించి సంచలన ఆరంభాన్నిచ్చాడు. అభిషేక్‌కు చక్కని సహకారాన్నిచ్చిన శాంసన్ కూడా బ్యాట్ ఝళిపించాడు. ముజీబ్ ఓవర్లో సిక్స్ బాదిన అతడు.. నబి ఓవర్లోనూ రెండు సిక్స్‌లు దంచేశాడు. ఓపెనర్ల జోరుతో భారత్ నాలుగో ఓవర్లోనే 50 పూర్తి చేసింది. 6 ఓవర్లకే 100కు చేరుకుంది. అయితే పదో ఓవర్లో అభిషేక్ ఔట్ కావడంతో ఓపెనింగ్ భాగస్వామ్యం విడిపోయింది. ఆ తర్వాత పరుగుల వేగం బాగా తగ్గిపోయింది. తిలక్ (2) రనౌట్ కాగా.. 34 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన శాంసన్.. 14వ ఓవర్లో వెనుదిరిగాడు. తర్వాతి బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ (29; 20 బంతుల్లో 2×6) ఒక్కడే రాణించాడు. భారత్ చివరి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులే చేసింది.
ఆ బాదుడు హైలైట్స్‌లా..: అభిషేక్ విధ్వంసక శతకమే భారత్ ఇన్నింగ్స్‌లో హైలైట్. టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించినందుకు అఫ్గాన్ తీవ్రంగా విచారించేలా చేశాడు ఈ ఓపెనర్. చూస్తున్నది లైవ్ మ్యాచా లేదా హైలైట్సా అని అనిపించేలా సాగింది అతడి ఊచకోత. అభిషేక్ చేసిన 108 పరుగుల్లో 102 ఫోర్లు, సిక్స్‌ల ద్వారానే వచ్చాయంటేనే అతడు ఎంతలా రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. రెండో ఓవర్లో అజ్మతుల్లా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టిన అభి.. ఫారూఖీని వరుసగా 6, 6, 6, 4తో శిక్షించాడు. నబి బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బాదేసిన అతడు.. ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. శతకాన్ని అందుకోవడానికి అతడికి మరో 14 బంతులే పట్టడం విశేషం. అర్ధశతకం తర్వాత ఏమాత్రం తగ్గని అభిషేక్.. అఫ్గానిస్థాన్ బౌలర్లను పూర్తిగా నిస్సహాయలుగా మార్చేశాడు. రషీద్ ఓవర్లో వరుసగా 4, 4, 6 దంచేసిన అతడు.. మరో స్పిన్నర్ ముజీబ్ ఓవర్లో రెండు సిక్స్‌లు దంచేశాడు. సెంచరీ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టాడు. అతడి బౌలింగ్‌లోనే అభిషేక్ ఔట్ కావడంతో వాన వెలిసినట్లయింది. అభిషేక్‌కు టీ20ల్లో ఇది మూడో శతకం.
శతకం కోసం అభిషేక్ ఆడిన బంతులు. టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన శాశ్వత సభ్య దేశం బ్యాటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. కివీస్ బ్యాటర్ ఫిల్ అలెన్ (దక్షిణాఫ్రికాపై), జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజా (గాంబియాపై)ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. వాళ్దిద్దరూ 33 బంతుల్లో శతకం సాధించారు. రోహిత్ (35 బంతుల్లో)ను అధిగమించి భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ప్రపంచ రికార్డు (సైప్రస్‌పై 27 బంతుల్లో) ఎస్తోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. తుర్కియే బ్యాటర్ ఫహాద్ (బల్గేరియాపై 29 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
భారత్ ఇన్నింగ్స్: శాంసన్ (సి) రషీద్ (బి) అజ్మతుల్లా 50; అభిషేక్ (సి) గుర్బాజ్ (బి) రషీద్ ఖాన్ 108; తిలక్ రనౌట్ 2; శ్రేయస్ రనౌట్ 29; దూబె (సి) రషీద్ (బి) అజ్మతుల్లా 14; ఇషాన్ రనౌట్ 10; నితీశ్ (సి) నూర్ (బి) అహ్మద్‌జాయ్ 1; అక్షర్ నాటౌట్ 5; బిష్ణోయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 221; వికెట్ల పతనం: 1-142, 2-152, 3-164, 4-186, 5-205, 6-206, 7-218; బౌలింగ్: ఫారూఖి 4-0-39-0; అజ్మతుల్లా 3-0-27-2; ముజీబ్ 4-0-45-0; నబి 1-0-29-0; రషీద్ 4-0-43-1; అహ్మద్‌జాయ్ 4-0-38-1
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) అక్షర్ 15; ఇబ్రహీం (సి) ఇషాన్ (బి) యశ్ 25; అటల్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 1; రసూలి (బి) బుమ్రా 0; అజ్మతుల్లా (సి) బిష్ణోయ్ (బి) నితీశ్ 17; నూర్ (సి) నితీశ్ (బి) బిష్ణోయ్ 11; నబి (బి) నితీశ్ 8; రషీద్ (బి) బిష్ణోయ్ 6; ముజీబ్ (బి) నితీశ్ 0; అహ్మద్‌జాయ్ (సి) అక్షర్ (బి) బిష్ణోయ్ 6; ఫారూఖి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (14.1 ఓవర్లలో ఆలౌట్) 94; వికెట్ల పతనం: 1-31, 2-33, 3-39, 4-47, 5-70, 6-81, 7-82, 8-82, 9-89; బౌలింగ్: నితీశ్ 4-0-25-3; బుమ్రా 2-0-16-1; యశ్ 2-0-17-1; అక్షర్ 3-0-9-2; బిష్ణోయ్ 3.1-0-26-3
Citations · 5 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Abhishek Sharma: ఔరా అభిషేక్.. 30 బంతుల్లోనే సెంచరీ - Eenadu
Abhishek Sharma: ఔరా అభిషేక్.. 30 బంతుల్లోనే సెంచరీ Eenadu
2 hours agoAbhishek Sharma: 30 బంతుల్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ రికార్డు - eenadu.net
Abhishek Sharma: 30 బంతుల్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ రికార్డు eenadu.net
10 hours agoAbhishek Sharma Fastest T20I Century: రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్.. 30 బంతుల్లోనే సెంచరీతో - ABP Desam
Abhishek Sharma Fastest T20I Century: రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్.. 30 బంతుల్లోనే సెంచరీతో ABP Desam
9 hours agoAbhishek Sharma Century Celebrations: 30 బంతుల్లోనే విధ్వంసంక సెంచరీ, మెడిటేషన్ సెలబ్రేషన్ తో దుమ్మురేపిన - ABP Desam
Abhishek Sharma Century Celebrations: 30 బంతుల్లోనే విధ్వంసంక సెంచరీ, మెడిటేషన్ సెలబ్రేషన్ తో దుమ్మురేపిన ABP Desam
35 minutes from nowAbhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే? - NTV Telugu
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే? NTV Telugu
1 hour from now