తెలుగు స్పై థ్రిల్లర్ ‘సీక్రెట్ సోల్జర్’ మూవీ రివ్యూ
తెలుగులో విడుదలైన కొత్త స్పై థ్రిల్లర్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’ పై ప్రముఖ మీడియా సంస్థలు తమ సమీక్షలను అందించాయి. ఈ సినిమా కథాంశం, కథనం మరియు నటీనటుల ప్రదర్శన ఎలా ఉందనే విషయాలపై ఈ రివ్యూలలో విశ్లేషించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే దానిపై వివిధ వెబ్‌సైట్లు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
First reported 4 hours ago · latest update 4 hours from now
Secret Soldier Review || చిత్రం: సీక్రెట్ సోల్జర్; నటీనటులు: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత, శ్రీష, కమల్ కామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు; సంగీతం: కార్తిక్; ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్; సినిమాటోగ్రఫీ: సురేశ్ రఘుతు; నిర్మాత: మూన్ లైట్ డ్రీమ్స్ ప్రై.లి.; రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాథ్‌రెడ్డి; విడుదల: 18-09-2026
‘చైనా పీస్’ పేరుతో పట్టాలెక్కి... ఆ తర్వాత పేరు మార్చుకున్న స్పై డ్రామా చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ప్రచార చిత్రాలతోపాటు, ఈ సినిమా జానర్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించాయి. స్పై సినిమాలు అనగానే భారీ తారాగణం, సాంకేతిక హంగులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. మరి ఈ చిత్రం ఎలాంది?ఎలాంటి థ్రిల్ పంచింది?
secret soldier telugu movie story || మీరా వలి (నిహాల్ కోదాటి ), పృథ్వీ (సూర్య శ్రీనివాస్) నెల్లూరు కుర్రాళ్లు. ఇద్దరూ మంచి స్నేహితులు. మీరావలికి దేశభక్తి ఎక్కువ. ఎప్పటికైనా సైన్యంలో చేరి, తన దేశభక్తిని నిరూపించుకోవాలనేది కల. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. పృథ్వీ కూడా తన వంతుగా ప్రోత్సాహం అందిస్తుంటాడు. కానీ, ఆ కల నెరవేరదు. ఇంతలో ఊహించని రీతిలో వలికి దేశభక్తిని నిరూపించుకునే అవకాశం వస్తుంది. అందుకోసం అతను గూఢచారిగా మారి, ఓ కీలకమైన మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకీ ఆ మిషన్ ఎందుకోసం?గూఢచారిగా మారిన మీరా వలి గురించి పృథ్వీకి ఎప్పుడు ఎలా తెలిసింది?దేశం కోసం వలి ఏం చేశాడు?వలికి సంబంధించిన విషయాలన్నీ తెలిసిన పృథ్వీని వెంటాడిన శత్రువులు ఎవరు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
secret soldier telugu movie Revewi || స్నేహం, దేశభక్తి మేళవింపుగా తెరకెక్కిన చిత్రమిది. సున్నితమైన అంశాలతో కూడిన ఓ కీలకమైన మిషన్‌కీ, నెల్లూరుకు చెందిన ఇద్దరు కుర్రాళ్లకీ మధ్య సంబంధం ఏమిటన్నది ఇందులో కీలకం. స్పై డ్రామా సినిమాల్లో కనిపించే హంగులకు భిన్నంగా రూపొందింది ఈ చిత్రం. ప్రథమార్ధం దాదాపుగా ఇద్దరు స్నేహితుల ప్రయాణంలాగే ఉంటుంది. భిన్న ఆలోచనలు, నేపథ్యాలున్న ఇద్దరు కుర్రాళ్ల మధ్య స్నేహం, అక్కడక్కడా పండిన సహజమైన హాస్యం మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో గూఢచర్యం నేపథ్యం, కథలోని మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సైన్యంలో చేరాలనుకున్న మీరావలి చేసే ప్రయత్నాలు, అతని కుటుంబం నేపథ్యంలోని సన్నివేశాలతో అసలు కథలోకి వెళ్లడానికి బాగా సమయం తీసుకుంటుంది. విరామానికి ముందు వచ్చే కీలకమైన మలుపు సినిమాకి హైలైట్. ఈ మిషన్‌లో స్నేహితులిద్దరూ భాగమయ్యే తీరు, వాళ్లు చేసే సాహసాలు, ఎవ్వరూ ఊహించని శత్రువులు వెలుగులోకి వచ్చే తీరు ద్వితీయార్ధానికి ప్రధాన ఆకర్షణ. అయితే ఇందులో గూఢచర్యం చేసే కథానాయకుడు శత్రువుల చేతుల్లో ఎప్పుడూ ఓ పావులాగే కనిపిస్తుంటాడు తప్ప, అతనంటూ సొంతంగా చూపించే తెగువ కానీ, చేసిన సాహసాలు పెద్దగా కనిపించవు. దేశానికి సంబంధించిన సున్నితమైన విషయాలు, వాటి భద్రతతో ముడిపడిన విషయాల్ని చూపించిన తీరు కూడా మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పేరుకే స్పై డ్రామా కానీ, ఆ గాఢత, సీరియస్‌నెస్ సన్నివేశాల్లో కనిపించదు. అయితే గూఢచారుల జీవితాలు ఎలా ముగిసిపోతుంటాయి?వాళ్లకు దక్కే గుర్తింపు ఎలాంటిదో ఇందులో చెప్పిన తీరు బాగుంది.
ఆ పాట వచ్చాక లక్ష జడలు అమ్మారు..: నాని
secret soldier telugu movie cast and crew || డబ్బున్న కుర్రాడిగా సూర్య శ్రీనివాస్, దేశభక్తి మెండుగా ఉన్న యువకుడిగా నిహాల్ కోదాటి ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఆ రెండు పాత్రల మధ్య స్నేహం సినిమాకి ప్రధానబలం. నెల్లూరు యాసలో మాట్లాడుతూ, అక్కడక్కడా నవ్విస్తూ సాగే పాత్రతో సూర్య శ్రీనివాస్ వైవిధ్యం కనబరిచారు. హర్షిత బండ్లమూరి, శిరీష నూలు పాత్రలు సినిమాకి కీలకం. రఘుబాబు, తులసి, వడ్లమాని శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు, రంగస్థలం మహేశ్ తదితర నటులు ఇందులో ఉన్నారు కానీ, వాళ్లని సమర్థంగా ఉపయోగించుకోలేదు దర్శకుడు. దాదాపుగా అందరూ చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు. అమ్మాయిల పాత్రలు మాత్రం ఆకట్టుకుంటాయి. సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. సినిమా నిడివి తక్కువే అయినా కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. దర్శకుడు అరుదైన నేపథ్యాన్నే తెరపై ఆవిష్కరించారు కానీ, కథని మరింత బలంగా చెప్పడం, నమ్మదగ్గ విధంగా చెప్పడంలో అక్కడక్కడా తడబడ్డాడు. మాటలు బాగున్నాయి. నిర్మాణం పర్వాలేదనిపిస్తుంది.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Secret Soldier Review: రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. తెలుగు స్పై థ్రిల్లర్ మెప్పించిందా? - Eenadu
Secret Soldier Review: రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. తెలుగు స్పై థ్రిల్లర్ మెప్పించిందా? Eenadu
1 hour from nowSecret Soldier Movie Review: ‘సీక్రెట్ సోల్జర్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? - News18 Telugu
Secret Soldier Movie Review: ‘సీక్రెట్ సోల్జర్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? News18 Telugu
4 hours agoSecret Soldier Movie Review: సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ - NTV Telugu
Secret Soldier Movie Review: సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ NTV Telugu
4 hours from now