75 ఏళ్ల కల.. కూటమి తీర్చిన వేళ - Eenadu
75 ఏళ్ల కల.. కూటమి తీర్చిన వేళ Eenadu
First reported 3 days ago · latest update 4 hours ago
వరికుంటపాడు, న్యూస్‌టుడే: ఉదయగిరి నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం వరికుంటపాడు. దశాబ్దాలుగా మండలంలోని పలు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలుఅగచాట్లు పడుతున్నారు. ఇదేకోవలో ప్రస్తుతం జాతీయ రహదారిపై ఉన్న కాకొల్లువారిపల్లె నుంచి హుస్సేన్‌నగర్ మీదుగా రామాపురం వద్ద జాతీయ రహదారి వరకు (రింగు రోడ్డు) రోడ్డు వేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఏడు దశాబ్దాలుగా కోరుతున్నారు. కాలిబాటలో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నరకాన్ని చవిచూవిస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే వారి అగచాట్లు వర్ణనాతీతం. దీనిపై పాలకులు స్పందించకపోవడంతో 1952లో రామాపురం గ్రామస్థులంతా ఏకమయ్యారు. చందాలు వేసుకున్నారు. చేయీచేయి కలిపారు. శ్రమదానంతో మూడు కి.మీ మేరకు మట్టి రోడ్డు వేసుకున్నారు. తారు రోడ్డు వేయాలని వీరు కోరుతున్నా పాలకుల చెవికెక్కలేదు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో వీరి కల తీరింది. రూ. 1.64 కోట్లతో 2.4 కి.మీ రోడ్డుకు మోక్షం కలిగింది. ఇటీవల తారు రోడ్డు వేశారు. మిగిలిన 2.6 కి.మీకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రూ. 2.08 కోట్లు మంజూరు చేయించారు. పల్లె పండగలో భాగంగా ఈగ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈనెల 24న రానున్నారు. ఆరోజు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు అంకురార్పణ జరగనుంది. సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
By Andhra Pradesh Dist. Desk Published : 21 Sep 2026 04:46 IST
► Read latest Nellore News and Telugu News
► Follow us on Facebook, Twitter, Instagram & Google News.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
75 ఏళ్ల కల.. కూటమి తీర్చిన వేళ - Eenadu
75 ఏళ్ల కల.. కూటమి తీర్చిన వేళ Eenadu
2 days agoతీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు, 75 కి.మీ వేగంతో గాలులు! - tv9telugu.com
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు, 75 కి.మీ వేగంతో గాలులు! tv9telugu.com
4 hours agoఅందాల కిరీటం @ 75 - andhrajyothy.com
అందాల కిరీటం @ 75 andhrajyothy.com
3 days ago