T.A.M · The Air Media
← Back to live feed
Weightage 83 3 outlets citing Entertainment IN

72nd National Film Awards Ceremony Held

The 72nd National Film Awards ceremony took place, honoring winners across various categories. Reports highlight significant recognition for Telugu cinema, with nine awards, and note calls for film personalities to avoid endorsing harmful products.

First reported 2 days ago · latest update 10 hours ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలు విభాగాల్లో తెలుగు సినిమాకు తొమ్మిది పురస్కారాలు దాదాసాహెబ్‌ ఫాల్కే అందుకున్న కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్‌ ఆర్యన్, ఉత్తమ నటిగా యామీ గౌతమ్‌లకు అవార్డుల ప్రదానం సుకుమార్, నాగ్‌ అశ్విన్, అశ్వినీ దత్, నిహారికలకూ..

రాష్ట్రపతి నుంచి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకుంటున్న అనంత్‌ నాగ్

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రముఖ సినీ తారలు ప్రచారం చేయొద్దని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. 2024 సంవత్సరానికిగానూ ప్రతిష్ఠాత్మక 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుక.. గుజరాత్‌లోని ఏక్తానగర్‌ (కెవాడియా)లోని ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ సమీపంలో మంగళవారం జరిగింది. ఈ వేడుకలో ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సీనియర్‌ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కేతో పాటు నటీనటులకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జ్యూరీ సభ్యులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఉత్తమ నటులుగా మమ్ముట్టి (భ్రమయుగం), కార్తిక్‌ ఆర్యన్‌(చందు ఛాంపియన్‌), ఉత్తమ నటిగా యామీ గౌతమ్‌ (ఆర్టికల్‌ 370) పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘ఆర్టికల్‌ 370’కి గానూ దర్శకుడు ఆదిత్య సుహాస్‌ జంబలేతో పాటు నిర్మాత ఆదిత్య ధర్‌ పురస్కారాల్ని స్వీకరించారు. తమిళ చిత్రం ‘అమరన్‌’కు గానూ రాజ్‌కుమార్‌ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా అవార్డును స్వీకరించారు. తాను దర్శకత్వం వహించిన ‘రాయన్‌’కి ఉత్తమ తమిళ చిత్రం కేటగిరీలో, స్పెషల్‌ మెన్షన్‌ విభాగంలో ఉత్తమ నటుడిగా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రానికిగానూ పురస్కారాలను అందుకున్నారు నటుడు ధనుష్‌. మలయాళ సినిమా ‘ఏఆర్‌ఎం’కి గానూ వైకోమ్‌ విజయలక్ష్మి బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌గా అవార్డుని స్వీకరించారు.

పల్లెటూరి వాతావరణం, మానవీయ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి దర్శకుడు యదు వంశీ, నిర్మాత నిహారిక కొణిదెలతో పాటు ఉత్తమ మేకప్‌ విభాగంలో పి.రవికుమార్‌ అవార్డులను అందుకున్నారు. ‘పుష్ప 2’ సినిమాకి దర్శకుడు సుకుమార్‌ ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత(ఒరిజినల్‌) విభాగంలో, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ దీపాలి నూర్, శీతల్‌ శర్మలు పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన ‘కల్కి 2898 ఏడీ’కి దర్శకుడు నాగ్‌ అశ్విన్, నిర్మాత అశ్వినీ దత్, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌లో విభాగంలో నితిన్‌ జిహానీ చౌదరి పురస్కారాల్ని అందుకున్నారు. ఉత్తమ బాలల సినిమాగా నిలవడమేగాక.. ఉత్తమ బాల నటుడి విభాగంలోనూ సత్తా చాటిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’. ఈ సినిమాకి దర్శకుడు నందకిశోర్‌ ఇమాని, నిర్మాత సృజన్‌ ఎరబోలుతో పాటు అరుణ్‌ దేవ్‌ పోతుల ఉత్తమ బాల నటుడిగా పురస్కారాలను స్వీకరించారు. ఉత్తమ స్క్రీన్‌ ప్లే(సంభాషణలు) విభాగంలో ‘లక్కీ భాస్కర్‌’ సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి అవార్డు అందుకున్నారు.

↗ Read the original at Eenadu

Citations · 5 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

72nd National Film Awards: హానికర ఉత్పత్తులకు..సినీ తారలు ప్రచారం చేయొద్దు - Eenadu

72nd National Film Awards: హానికర ఉత్పత్తులకు..సినీ తారలు ప్రచారం చేయొద్దు Eenadu

10 hours ago
83 TV9 Telugu

72nd National Film Awards 2026: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే.. తెలుగు నుంచి... - tv9telugu.com

72nd National Film Awards 2026: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే.. తెలుగు నుంచి... tv9telugu.com

22 hours ago
80 Google News Telugu Entertainment

72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు వేడుక.. తెలుగులో ఏ ఏ సినిమాలు ఉన్నాయంటే - tv9telugu.com

72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు వేడుక.. తెలుగులో ఏ ఏ సినిమాలు ఉన్నాయంటే tv9telugu.com

2 days ago
80 Google News Telugu Entertainment

72nd National Film Awards 2026: ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం.. హాజరవుతున్న... - tv9telugu.com

72nd National Film Awards 2026: ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం.. హాజరవుతున్న... tv9telugu.com

1 day ago
80 Google News Telugu Entertainment

72nd National Film Awards: టాలీవుడ్కు 9 జాతీయ అవార్డులు.. యామీ, మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్‌లు బెస్ట్ యాక్టర్స్ - V6 Velugu

72nd National Film Awards: టాలీవుడ్కు 9 జాతీయ అవార్డులు.. యామీ, మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్‌లు బెస్ట్ యాక్టర్స్ V6 Velugu

22 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app