Asian Games 2026: Updates on Indian athletes and cricket tournament progress
Indian athletes have secured multiple medals, including silver in shooting, while the men's cricket team has advanced to the final. Media reports also discuss potential outcomes for cricket matches in the event of rain interruptions.
First reported 1 week ago · latest update 1 hour ago
ట్రాప్ పసిడితో చరిత్ర సృష్టించిన షూటర్ నీరూ 4×400 మీ. రిలేలో మహిళల జట్టు విజయం
జపాన్‌లో ఆసియా క్రీడల మొదలైనప్పటి నుంచి పతకాల వేటలో భారత్ కాస్త వెనుకబడే ఉంది. ముఖ్యంగా స్వర్ణాలు మరీ తగ్గిపోవడం చాలా అసంతృప్తినే కలిగించింది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు గొప్ప ఊరటే లభించింది. ఏషియాడ్‌లో మంగళవారం ఒక్క రోజే భారత్ రెండు పసిడి పతకాలు సాధించింది. షూటర్ నీరూ దాండా, 4×400 రిలే మహిళలు అదరగొట్టారు. మహిళల వ్యక్తిగత ట్రాప్ షూటింగ్ స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళగా నీరూ చరిత్ర సృష్టిస్తే.. కిరణ్ పహాల్, పూవమ్మ, ప్రాచి, విద్యలతో కూడిన చతుష్ఠయం 2026 క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. మరో రజతం, అయిదు కాంస్యాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. నీరూ టీమ్ విభాగంలో రజతం కూడా సొంతం చేసుకుంది. ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కలిసి ఆమె మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో వెండి పతకాన్ని చేజిక్కించుకుంది. 5000 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచిన రన్నర్ గుల్వీర్.. ఈ క్రీడల్లో పతకాల హ్యాట్రిక్ కొట్టాడు. బాక్సర్లు అంకుశ్, పర్వీన్ ఫైనల్ చేరడంతో భారత్‌కు కనీసం ఇంకో రెండు రజత పతకాలు కూడా ఖాయమయ్యాయి.
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో షూటింగ్ పసిడి దక్కింది. ఏషియాడ్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా నీరూ దండా రికార్డు సృష్టించింది. 26 ఏళ్ల నీరూ.. ఫైనల్లో 30 టార్గెట్లలో 28 షూట్ చేసింది. ఆమె ఆసియా రికార్డు (24)ను బద్దలు కొట్టింది. చైనాకు చెందిన యునాంగ్ (26) రజతం నెగ్గగా.. కువైట్ షూటర్ హజార్ (21) కాంస్యం గెలుచుకుంది. నీరూ.. అయిదుకు అయిదు హిట్స్‌తో ఫైనల్‌ను ఘనంగా మొదలెట్టింది. కానీ రెండో సిరీస్‌లో ఒక టార్గెట్‌ను కొట్టలేకపోయింది. ఆ తర్వాత రెండు సిరీస్‌ల్లో గురితప్పలేదు. 20కి 19 హిట్స్‌తో ఆమె సమీప ప్రత్యర్థులకన్నా రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయిదో సిరీస్‌లో నీరూ ఓసారి గురి తప్పింది. కానీ ఆఖరి సిరీస్‌లో మరోసారి అయిదుకు అయిదు స్కోర్ చేసి 28 పాయింట్లతో విజేతగా నిలిచింది. ఈ స్వర్ణానికి ముందు నీరూ మహిళల ట్రాప్ ఈవెంట్లో రజతం కూడా నెగ్గింది. నీరూ, ఆషిమా, మనీషాలతో కూడిన జట్టు 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నీరూ 118 పాయింట్లతో జట్టు రజతం నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది. ఆషిమా 106, మనీషా 104 పాయింట్లు స్కోర్ చేశారు. చైనా (346) స్వర్ణం, కువైట్ (325)కు కాంస్యం గెలిచాయి.
రిలేలో అమ్మాయిల మెరుపులు: ఎట్టకేలకు 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు అథ్లెటిక్స్ స్వర్ణం లభించింది. కిరణ్ పహాల్, పూవమ్మ, ప్రాచి, విద్య రామ్‌రాజ్‌లతో కూడిన మహిళల 4×400 రిలే జట్టు ఈ పతకాన్ని అందించింది. కసిగా పరుగెత్తిన ఈ జట్టు 3 నిమిషాల 29.69 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. బహ్రెయిన్ జట్టుకు రజతం, చైనా జట్టుకు కాంస్యం దక్కాయి. భారత్ తరఫున కిరణ్ రేసును మొదలెట్టింది. రెండో లెగ్‌లో వేగంగా పరుగెత్తిన పూవమ్మ, జట్టును ఆధిక్యంలో నిలిపింది. తర్వాత ప్రాచి ఆధిక్యాన్ని కొనసాగించింది. యాంకర్ లెగ్‌లో బ్యాటన్ అందుకున్న విద్య.. జట్టును విజయపథంలో నడిపించింది. విద్యకిది ఈ క్రీడల్లో మూడో పతకం. ఆమె 400మీ హర్డిల్స్‌లో కాంస్యం సాధించింది. 4×400లో రజతం నెగ్గిన జట్టులో విద్య సభ్యురాలు. మరోవైపు గురిందర్‌వీర్, అనిమేశ్ కుజుర్, స్నేహ సత్యనారాయణ, హరిత భద్రాలతో కూడిన భారత జట్టు 4×100 మిక్స్‌డ్ రిలేలో కాంస్యం గెలుచుకుంది. ఈ బృందం 41.06 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుంది. పురుషుల 4×400 రిలేలో కూడా భారత్‌కు కాంస్యం లభించింది. ధరమ్‌వీర్, మను, జయ్ కుమార్, విశాల్‌లతో కూడిన జట్టు (3:01.61).. జపాన్, ఖతార్ జట్ల తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
గురిందర్‌వీర్, హరిత, అనిమేశ్, స్నేహ
మహిళల హైజంప్‌లో పూజ సింగ్ కాంస్యం గెలుచుకుంది. 19 ఏళ్ల పూజ.. 1.84 మీటర్ల ఎత్తు ఎగిరింది. ఇది ఆమె వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కన్నా తక్కువే. అయినా పూజ పతకం నెగ్గగలిగింది. బాబి అలాయ్‌సియస్ (2022లో రజతం) తర్వాత ఏషియాడ్‌లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా హైజంపర్‌గా పూజ ఘనత సాధించింది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సేఫులేవా (1.90మీ) స్వర్ణం, కజకిస్థాన్ అమ్మాయి క్రిస్టినా (1.87మీ) రజతం నెగ్గారు. పురుషుల పోల్‌వాల్ట్‌లో దేవ్ కుమార్ 5.50మీ ఎత్తుకు ఎగిరి జాతీయ రికార్డు నెలకొల్పినా.. ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 800మీ పురుషుల విభాగంలో అఫ్సల్ ఎనిమిదో స్థానంలో, మహిళల విభాగంలో పూజ ఒలా ఏడో స్థానంలో నిలిచారు. మహిళల హ్యామర్ త్రోలో తాన్యా చౌదరి (65.35మీ) కొద్దిలో పతకాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. అనుష్క యాదవ్ (64.56మీ) అయిదో స్థానంతో సరిపెట్టుకుంది.
బాక్సింగ్ ఫైనల్లో అంకుశ్, పర్వీన్
ఈ ఆసియా క్రీడల్లో భారత్ తొలి బాక్సింగ్ స్వర్ణానికి చేరువైంది. పదునైన పంచ్‌లు విసురుతూ అంకుశ్ పంఘాల్, పర్వీన్ హుడా ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల 80 కిలోల సెమీఫైనల్లో అంకుశ్ 4-1తో ప్రపంచ ఛాంపియన్ ఫజ్లిదిన్ ఎర్కిన్‌బొయేవ్ (ఉజ్బెకిస్థాన్)కు షాకిచ్చాడు. తొలి రౌండ్లో వెనుకబడ్డ అంకుశ్.. ఆ తర్వాత బలంగా పుంజుకున్నాడు. మహిళల 65కేజీ సెమీస్‌లో పర్వీన్ 5-0తో చైనా బాక్సర్ లి షును చిత్తు చేసింది. మరోవైపు నరేందర్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల +90 కేజీ సెమీస్‌లో అతడు 0-5తో కజకిస్థాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ ఐబెక్ ఒరాల్‌బే చేతిలో పరాజయంపాలయ్యాడు.
ఆర్చరీ రికర్వ్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర సహా ముగ్గురు భారతీయులు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో ధీరజ్ 6-2తో చెంగ్ సియాంగ్ హూ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో నీరజ్ చౌహాన్ 6-4తో మూడుసార్లు ఒలింపిక్ స్వర్ణపతక విజేత కిమ్ జి దియోక్ (దక్షిణ కొరియా)కు షాకిచ్చాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో కుంకుమ్ 6-0తో సైమా (బంగ్లాదేశ్)ను చిత్తు చేసింది. వాలీబాల్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
స్క్వాష్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. గ్రూప్‌లో తన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 3-0తో ఇరాన్‌ను ఓడించింది. తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్, జోష్న చిన్నప్ప విజయాలు సాధించారు. భారత్ క్వార్టర్స్‌లో సింగపూర్‌ను ఢీకొంటుంది.
గుల్వీర్ హ్యాట్రిక్.. 5 వేల మీ. పరుగులో కాంస్యం సొంతం
జపాన్ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పతకాల హ్యాట్రిక్ కొట్టాడు. జోరు కొనసాగిస్తూ మంగళవారం పురుషుల 5 వేల మీటర్ల పరుగులో అతడు కాంస్యంతో మెరిశాడు. గుల్వీర్ 13 నిమిషాల 32.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రీడల్లో గుల్వీర్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. ఇప్పటికే 1500 మీటర్లు, 10 వేల మీటర్లలో అతడు రజతాలు సాధించాడు. ఒకే ఆసియా క్రీడల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన రెండో భారత పురుష అథ్లెట్‌గా గుల్వీర్ ఘనత సాధించాడు. దిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో లావీ పింటో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో స్వర్ణాలు.. 4×100 మీటర్ల రిలేలో రజతం సాధించాడు. మొత్తంగా ఒకే ఆసియా క్రీడల్లో అత్యధిక పతకాల రికార్డు దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష పేరిట ఉంది. 1986 సియోల్ క్రీడల్లో ఆమె 4 స్వర్ణాలు, 1 రజతం గెలుచుకుంది. బీనామోల్ (2002, 2 స్వర్ణాలు, 1 రజతం) తర్వాతి స్థానంలో ఉంది.
ఆసియా క్రీడల టెన్నిస్ సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు దక్షిణేశ్వర్ సురేశ్, సుమిత్ నగాల్ శుభారంభం చేశారు. రెండో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. సురేశ్ 7-5, 7-6 (2)తో త్రిస్మువంతర (ఇండోనేసియా)పై నెగ్గగా.. నగాల్ 6-4, 6-0తో హాంగ్ (దక్షిణకొరియా)ను ఓడించాడు. ఈ ఆటగాళ్లకు తొలి రౌండ్లో బై లభించింది.
4×400 మీటర్ల పురుషుల రిలే జట్టు
Citations · 9 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Asian Games 2026: భారత్ ధగధగ.. ఒకే రోజు రెండు స్వర్ణాలు - Eenadu
Asian Games 2026: భారత్ ధగధగ.. ఒకే రోజు రెండు స్వర్ణాలు Eenadu
1 day agoAsian Games 2026: క్వార్టర్స్ వర్షార్పణం.. సెమీస్‌లూ వాష్‌అవుట్ అయితే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు? - Eenadu
Asian Games 2026: క్వార్టర్స్ వర్షార్పణం.. సెమీస్‌లూ వాష్‌అవుట్ అయితే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు? Eenadu
22 hours agoAsian Games 2026: ఇండియా బంగారాలు వీళ్లే - Sakshi
Asian Games 2026: ఇండియా బంగారాలు వీళ్లే Sakshi
1 hour agoAsian Games 2026: భారత్-శ్రీలంక మధ్య తుది పోరు.. ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా? - tv9telugu.com
Asian Games 2026: భారత్-శ్రీలంక మధ్య తుది పోరు.. ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా? tv9telugu.com
1 week agoAsian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్? - Asianet News Telugu
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్? Asianet News Telugu
1 week agoAsian Games 2026: ఇది కదా టీమిండియా రేంజ్.. మ్యాచ్ ముందే భయపడ్డ పాక్ కోచ్ - idreampost.com
Asian Games 2026: ఇది కదా టీమిండియా రేంజ్.. మ్యాచ్ ముందే భయపడ్డ పాక్ కోచ్ idreampost.com
6 days agoAsian Games 2026: టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరు..? మ్యాచ్ టైమింగ్, డేట్ వివరాలు ఇవే! - iDreamPost
Asian Games 2026: టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరు..? మ్యాచ్ టైమింగ్, డేట్ వివరాలు ఇవే! iDreamPost
6 days agoAsian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే! - NTV Telugu
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే! NTV Telugu
3 days agoAsian Games: ఆసియా గేమ్స్ ఫైనల్ వర్షంతో రద్దైతే.. గోల్డ్ మెడల్ ఎవరికి..? - tv9telugu.com
Asian Games: ఆసియా గేమ్స్ ఫైనల్ వర్షంతో రద్దైతే.. గోల్డ్ మెడల్ ఎవరికి..? tv9telugu.com
2 days ago