T.A.M · The Air Media
← Back to live feed
Weightage 93 3 outlets citing Sports IN

యుజ్వేంద్ర చాహల్: టెస్ట్ క్రికెట్‌కి వీడ్కోలు, రెడ్‌బాల్‌లో కొనసాగుతాను

భారతీయ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టెస్ట్ క్రికెట్ నుండి రాజీనామా చేసుకున్నట్లు, కానీ రెడ్‌బాల్ (T20/ODI) ఫార్మాట్‌లో ఇంకా ఆడతానని ప్రకటించారు. అన్ని తెలుగు మీడియా ఈ నిర్ణయాన్ని ఒకేలా నివేదించాయి, ఏవైనా విభేదాలు లేవు.

First reported 14 hours ago · latest update 14 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా జాతీయ జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తోన్న లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. రెడ్‌-బాల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టాడు. భారత్ తరఫున టెస్టుల్లో (Tests) ఆడాలన్న తన కల నెరవేరకుండానే.. అతడు ఈ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

‘‘నేను మొదటిసారి ఎర్ర బంతిని ఎదుర్కొన్నప్పుడు నా వయసు పదేళ్లు. ఈ గేమ్‌తో ఇంతలా ప్రేమలో పడతానని అప్పుడు కనీసం ఊహించలేదు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌ అంటే కేవలం ఒక ఫార్మాట్‌ మాత్రమే కాదు.. గంటల తరబడి సహనంతో ఉండటం, పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదగడానికి అర్థమేంటో నేను ఈ ఫార్మాట్‌లోనే నేర్చుకున్నా. ఇక్కడ ప్రతి పరుగు కోసం చేసే పోరాటం ఎంతో ఆనందాన్నిచ్చింది. చివరిసారిగా నేను లార్డ్స్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాను. టెస్టు క్యాప్‌ ధరించడం నా కల. దాని కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. అది నెరవేరలేదు. కానీ, ఈ ఫార్మాట్‌లో వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించా. ఈ ఎర్రబంతి నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగిల్చింది’’ అని చాహల్‌ రాసుకొచ్చాడు.

‘‘దేశం కోసం ఆడాలన్న నా తపన ఇంకా సజీవంగానే ఉంది. వన్డేలు, టీ20 ఫార్మాట్‌లో అవకాశం కోసం అన్ని శాయశక్తులా ప్రయత్నిస్తా’’ అని చాహల్‌ వెల్లడించాడు. 2009లో చాహల్‌ హరియాణా తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్‌లో 49 మ్యాచ్‌లు ఆడి.. 148 వికెట్లు తీశాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో 72 వన్డేలు, 80 టీ20లకు ప్రాతినిధ్యం వహించిన ఈ లెగ్‌ స్పిన్నర్‌కు ఇప్పటివరకు టెస్టుల్లో ఆడే అవకాశం లేదు. అంతేకాదు.. ఫిట్‌నెస్‌, ఇతరత్రా కారణాలతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. చివరిసారిగా 2023లో వెస్టిండీస్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో కన్పించాడు.

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Yuzvendra Chahal: టెస్ట్‌ కల తీరకుండానే.. రెడ్‌బాల్‌ క్రికెట్‌కు చాహల్‌ గుడ్‌బై - Eenadu

Yuzvendra Chahal: టెస్ట్‌ కల తీరకుండానే.. రెడ్‌బాల్‌ క్రికెట్‌కు చాహల్‌ గుడ్‌బై Eenadu

14 hours ago
83 TV9 Telugu

Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ కీలక నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు చాహల్ గుడ్ బై - tv9telugu.com

Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ కీలక నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు చాహల్ గుడ్ బై tv9telugu.com

14 hours ago
80 Google News Telugu Sports

Yuzvendra Chahal : టెస్టులు ఆడాల‌న్న నా క‌ల ఇక నెర‌వేర‌దు.. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన చాహ‌ల్.. మ‌రోసారి టీమ్ఇండియా త‌రుపున ఆడ‌తా.. - 10TV Telugu

Yuzvendra Chahal : టెస్టులు ఆడాల‌న్న నా క‌ల ఇక నెర‌వేర‌దు.. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన చాహ‌ల్.. మ‌రోసారి టీమ్ఇండియా త‌రుపున ఆడ‌తా.. 10TV Telugu

14 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app