T.A.M · The Air Media
← Back to live feed
Weightage 99 3 outlets citing Entertainment IN

సిగ్మా సినిమా సమీక్ష: విజమ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం

తెలుగు మీడియా ‘Asianet News Telugu’, ‘NTV Telugu’ మరియు ‘Eenadu’ అన్ని సినిమా కథ, నటన, సంగీతం వంటి అంశాలను విశ్లేషించాయి. సమీక్షలలో దర్శకుని మొదటి చిత్రం అని, కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, నటుల ప్రదర్శనను ప్రశంసించారు. ఏదైనా ప్రధాన అసమ్మతి లేదు.

First reported 3 hours ago · latest update 2 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

Sigma Movie Review Telugu || చిత్రం: సిగ్మా; నటీనటులు: సందీప్‌ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌ రాజ్, శివ్‌ పండిట్, అన్బు దాసన్, యోగ్‌ జాపి తదితరులు; సంగీతం: తమన్‌; సినిమాటోగ్రఫీ: కృష్ణన్‌ వసంత్‌; దర్శకత్వం: జేసన్‌ సంజయ్‌; నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌; విడుదల తేదీ: 02-10-2026

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’. సందీప్‌ కిషన్‌ - ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. ఈ చిత్ర ప్రచారం కోసం చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగడం.. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో కాస్త అంచనాలేర్పడ్డాయి. (sigma movie release date) మరి ఈ చిత్రం వాటిని అందుకుందా? ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

Sigma Movie Story || గురు (సందీప్‌ కిషన్‌) తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన లైబ్రరీని నడిపిస్తూనే.. స్టోరీ టెల్లర్‌గా యూట్యూబ్‌లో ఫేమస్‌ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటాడు. కాకపోతే తండ్రి చేసిన అప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. ఈ క్రమంలోనే తన ఇంటిని కాపాడుకునేందుకు ఒక్క రాత్రిలో రూ.1.25కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఆ డబ్బు కోసం గురు ప్రయత్నాలు చేస్తుండగా.. క్యాసినో, డ్రగ్స్‌ పేరుతో డబ్బులు దోచుకుంటున్న విన్సెంట్‌ (శివ్‌ పండిట్‌) అనే గ్యాంగ్‌స్టర్‌ నేరాలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ ఒకటి దొరుకుతుంది. దీంతో ఆ పెన్‌డ్రైవ్‌ని అడ్డం పెట్టుకుని విన్సెంట్‌ని బ్లాక్‌మెయిల్‌ చేసి తనకి కావాల్సిన డబ్బును సంపాదించేందుకు ఓ ప్రణాళిక రచిస్తాడు. కానీ, సరిగ్గా అప్పుడే తన రూ.1000 కోట్ల డబ్బుకు సంబంధించిన లాకర్‌ తాళాన్ని వెతుక్కుంటూ ఇంటర్నేషనల్‌ మాఫియా లీడర్‌ వీరయ్య రెడ్డి (సంపత్‌ రాజ్‌) రంగంలోకి దిగడంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు వీరయ్య ఎవరు? డబ్బు కోసం గురు - విన్సెంట్‌ - వీరయ్యకి మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారు? ఈ కథలో ఆర్జే సామ్‌ (ఫరియా అబ్దుల్లా), నీల్‌ (రాజు సుందరం) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? అన్నది చిత్ర కథ.

sigma movie review telugu || ఇదొక రొటీన్‌ మనీ హైయిస్ట్‌ థ్రిల్లర్‌. డబ్బు కోసం కథానాయకుడికీ ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌కూ మధ్య జరిగే పోరు. దర్శకుడు జేసన్‌ రాసుకున్నదే ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి కథైతే.. దాన్ని తెరకెక్కించిన తీరు పరమ రొటీన్‌. ఈ కథలో థ్రిల్‌ పంచే మలుపులు, ఊహకందని ట్విస్ట్‌లు.. బలమైన సంఘర్షణ మచ్చుకైనా కనిపించదు. సినిమా మొదలైన కాసేపటికే ఇదెలా ఉండబోతుందన్న క్లారిటీ ప్రేక్షకులకు వచ్చేస్తుంది. ఆరంభ సన్నివేశాలన్నీ సాగదీత వ్యవహారమే. హీరో చేతికి పెన్‌ డ్రైవ్‌ దొరకడంతో కథకి కీలక మలుపు. కాకపోతే అందులో ఏముంది? ఆ సమాచారం బయటకొస్తే వచ్చే నష్టమేంటి? అనేది బలంగా చెప్పలేకపోయారు. దీనికి తోడు ఆ పెన్‌డ్రైవ్‌కి.. రూ.1000కోట్ల లాకర్‌ తాళానికి లింక్‌ పెట్టడం.. అది క్లైమాక్స్‌ వరకు హీరో కూడా తెలుసుకోలేకపోవడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. గురు దారిలోకి వీరయ్య రావడం.. ఈక్రమంలో వచ్చే విరామ ఘట్టాలు ఓకే అనిపిస్తాయి.

ఇక ద్వితీయార్ధం నుంచి కథ గాడి తప్పింది. రూ.1000కోట్ల డబ్బు కోసం అటు ఇద్దరు విలన్ల మధ్యే ఓ మైండ్‌ గేమ్‌ సాగుతుండటం.. ఇంకో వైపు హీరో డబ్బుల కోసం తిప్పలు పడటం.. ఈ మధ్యలో సాగే ఛేజింగ్‌లు ఏవీ థ్రిల్‌ పంచవు. అసలు ఈ కథలో హీరో ప్రయాణం మొదలైందే తన తల్లి జ్ఞాపకమైన ఇంటిని అప్పుల వాళ్ల బారి నుంచి కాపాడుకోవడం కోసం. కానీ, అసలు ఆ ఎమోషన్‌నే దర్శకుడు మళ్లీ టచ్‌ చేయకపోవడం విచిత్రం. ప్రీక్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు సాగే సుదీర్ఘ యాక్షన్‌ హంగామా అంతా ప్రేక్షకుల సహనానికి మరో పరీక్ష.

నటుడిగా సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ప్రతిభకి పరీక్ష పెట్టే చిత్రమేది కాదిది. సినిమా అంతా సెటిల్డ్‌ నటనతో అలరించే ప్రయత్నం చేశారు. ఫరియా పాత్రకి కథలో ఏమంత ప్రాధాన్యత లేదు. సంపత్‌ రాజ్, శివ్‌ పండిట్‌లవీ రొటీన్‌ విలన్‌ పాత్రలే. రాజు సుందరం, అన్బు దాసన్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. జేసన్‌ (Jason Sanjay) రాసుకున్న కథలో బలం లేదు. దాన్ని తెరకెక్కించిన తీరు ఏమాత్రం ఆకట్టుకోదు. తమన్‌ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ తన స్థాయికి తగ్గట్లుగా బడ్జెట్‌ ఖర్చు పెట్టింది.

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Sigma Movie Review: రివ్యూ: సిగ్మా.. దర్శకుడిగా సీఎం విజయ్‌ కుమారుడు ఫస్ట్‌ మూవీ ఎలా ఉంది? - Eenadu

Sigma Movie Review: రివ్యూ: సిగ్మా.. దర్శకుడిగా సీఎం విజయ్‌ కుమారుడు ఫస్ట్‌ మూవీ ఎలా ఉంది? Eenadu

2 hours ago
80 Google News Telugu Entertainment

Sigma Movie Review: సిగ్మా మూవీ రివ్యూ.. విజమ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే - Asianet News Telugu

Sigma Movie Review: సిగ్మా మూవీ రివ్యూ.. విజమ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే Asianet News Telugu

3 hours ago
79 NTV Telugu

Sigma Movie Review Telugu : ‘సిగ్మా’ మూవీ రివ్యూ - NTV Telugu

Sigma Movie Review Telugu : ‘సిగ్మా’ మూవీ రివ్యూ NTV Telugu

2 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app