T.A.M · The Air Media
← Back to live feed
Weightage 85 3 outlets citing Entertainment IN

చుట్టమల్లె సాంగ్ వివాదంపై స్పందించిన నటి జాన్వీ కపూర్

చుట్టమల్లె పాట వివాదంపై నటి జాన్వీ కపూర్ స్పందించారు. ఈ వివాదంపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిజిటల్ కంటెంట్ భయాలు మరియు ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

First reported 2 days ago · latest update 6 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
TV9 Telugu Authority 83

దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటను మార్ఫింగ్ చేయడంపై యావత్ సినీలోకం మండిపడింది. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయడంపై సినీ నటులు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ సహా పలువురు నటీనటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత నీచమైన చర్య అని.. ఇలాంటి వాటికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా ఇష్యూ పై కథానాయిక జాన్వీ కపూర్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీస్ లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

" ఏఐ సాంకేతికతో మహిళలను వస్తువులుగా చిత్రీకరించడానికి, వారి అనుమతి లేకుండా కల్పిత కంటెంట్ ను ప్రచారం చేయడం అనేది అత్యంత అవమానకర చర్య. ఇలాంటి పనులు చేయడం బాధాకరం. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని పని. నేనున్న చిత్రపరిశ్రమలో ప్రతి మహిళా ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితిని ఏదోరకంగా ఎదుర్కొన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇలాంటి దాడులకు గురవుతున్నారు. ప్రతి మహిళకు ఆమె శరీరం పట్ల గౌరవం ఇవ్వడం అనేది మానవత్వపు విలువల్లో అత్యంత ప్రాథమికమైనది. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక మహిళ వద్దు అని చెబితే ఆ వద్దు అనేదాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలి. ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించినా.. ఆమె హద్దులను గౌరవించడం అనేది చాలా ముఖ్యం. ఆమె మినీస్కర్ట్ ధరించినంత మాత్రానా ఇష్టానుసారంగా కెమెరా పెట్టడానికి.. అభ్యంతరకరమైన కోణాల్లో చిత్రీకరించడానికి లేదా ఆమె శరీరాన్ని చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చినట్లు కాదు. ఒక మహిళ దేనితో సౌకర్యంగా ఉంటుంది.. ఎలాంటి హద్దులు గీసుకుంటుంది.. తన శరీరంతో ఏం చేయాలనుకుంటుంది అనేది పూర్తిగా ఆమె సొంత నిర్ణయాలు. ఇది ఆమె ప్రాథమిక విషయం. గత కొన్ని రోజులుగా నేను చూసిన ఏఐ వీడియోల కన్నా, లేదా నా కెరీర్‌లో నేను వ్యక్తిగతంగా ఎదుర్కోన్న సమస్యల కంటే ఇది చాలా తీవ్రమైనది. అసలు వాస్తవం ఏంటంటే.. ఒక మహిళ ఎదుటివారి చూపులు, వారి తీర్పుల నుంచి తన భద్రత కోసం నిరంతరం చేసే పోరాటం. ఒక మహిళ హద్దులు, నిర్ణయాలు అనేది ఇప్పటికీ ఇతరుల అధీనంలో ఉన్నాయనేది చాలా బాధకరం. ప్రతిరోజూ మహిళల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న వాస్తవమైన, భౌతిక భయాలు ఇఫ్పుడు డిజిటల్ ప్రపంచంలోకి విస్తరించాయి. మహిళల భద్రత, హద్దుల గురించి ప్రజలు ఆలోచించే విధానంలో మార్పు రావాలి. మీ కూతురిని రక్షించుకోండి అని చెప్పడం మాత్రమే కాదు.. అసలు ఇతరుల హద్దులను ఉల్లంఘించే హక్కు తమకు ఉందని అనుకునే కొందరి ఆలోచన విధానాన్ని కూడా మనం తొలగించాలి. ఆ మార్పులో కొంతభాగం ఆధర్శప్రాయమైన పురుషుల నుంచి వస్తుంది. ఏది సరైనదో, ఏది తప్పో స్పష్టంగా చెప్పగల నైతిక దిక్సూచి అనే చెప్పడం ధైర్యం ఉన్న పురుషుల నుంచి వస్తుంది. ఆ వీడియోకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎన్టీఆర్ సర్ కు ధన్యవాదాలు. లక్షలమంది అభిమానించే వ్యక్తి.. తనకు నేరుగా సంబంధం లేని విషయం గురించి మాట్లాడినప్పుడు ప్రతి మహిళకు ధైర్యం వస్తుంది. అలాగే చిరంజీవి సర్, విజయ్, ఖుష్బూ మేడమ్ లకు ధన్యవాదాలు. . ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, ఏ రూపంలోనైనా వేధింపులకు పాల్పడే వారిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తాయని నేను ఆశిస్తున్నాను. ఒక మహిళను కేవలం ఒక మనిషిగా చూడాలని, గౌరవించాలని కోరడం నిజంగా అంత పెద్ద విషయమా?

" అంటూ జాన్వీ కపూర్ సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్.. జాన్వీ కపూర్ పోస్ట్.. [caption id="attachment_1926968" align="alignnone" width="1280"] Janvhi Kapoor Reacts[/caption] [caption id="attachment_1926969" align="alignnone" width="1280"] Janvhi Kapoor[/caption] ఎక్కువమంది చదివినవి : మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

↗ Read the original at TV9 Telugu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

83 TV9 Telugu ★ most authoritative citation

Janhvi Kapoor: ఇది అత్యంత అవమానకర చర్య.. చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. - tv9telugu.com

Janhvi Kapoor: ఇది అత్యంత అవమానకర చర్య.. చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. tv9telugu.com

6 hours ago
80 Google News Telugu Technology

Janhvi Kapoor : తప్పకుండా చర్యలు తీసుకుంటాం.. చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. - tv9telugu.com

Janhvi Kapoor : తప్పకుండా చర్యలు తీసుకుంటాం.. చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. tv9telugu.com

2 days ago
80 Google News Telugu Entertainment

Janhvi Kapoor : ఇది లైంగిక దాడే... డిజిటల్ కంటెంట్ భయం వెంటాడుతోంది - చుట్టమల్లే AI వీడియోపై - ABP Desam

Janhvi Kapoor : ఇది లైంగిక దాడే... డిజిటల్ కంటెంట్ భయం వెంటాడుతోంది - చుట్టమల్లే AI వీడియోపై ABP Desam

7 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app