T.A.M · The Air Media
← Back to live feed
Weightage 87 3 outlets citing Entertainment IN

Legendary Indian Film Director Singeetham Srinivasa Rao Passes Away

Renowned filmmaker Singeetham Srinivasa Rao has died at the age of 95. Known for his experimental work across various genres, his passing is being mourned by the Telugu film industry, with reports noting he had an unfinished 62nd film project.

First reported 17 hours ago · latest update 3 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

చెన్నై: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(95) (Singeetham Srinivasa Rao) కన్నుమూశారు. వయోభారంతో చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. చివరిగా నాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలో ‘సింగ్‌ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించి పలువురు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, మయూరి, విచిత్ర సోదరులు తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

సినీ కుటుంబమంతా ఒక్కటి కావాలి : చిరంజీవి

1931 సెప్టెంబర్‌ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆయన జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ ఆధ్వర్యంలో నాటకాల్లోకి రంగ ప్రవేశం చేశారు. కళాశాల రోజుల్లోనే హాలీవుడ్‌ చిత్రాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన స్వయంగా రచించిన నాటకాలు బ్రహ్మ, అంత్యఘట్టం. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘చిత్ర’ను ‘చిత్రార్జున’ నాటకంగా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. 1960లో లక్ష్మీకల్యాణిని వివాహం చేసుకున్నారు. సినిమాల రచనలో శ్రీనివాసరావుకు ఆమె తోడుగా నిలిచారు. సతీమణి పేరుపై ‘శ్రీకల్యాణీయం’ పుస్తకం రాశారు. 2022లో అనారోగ్యంతో సింగీతం భార్య లక్ష్మీకల్యాణి మృతి చెందారు.

ఆ నీచులను వదిలిపెట్టను: ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

తెలుగుతోపాటు పలు భాషల్లో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సినీ రంగంలో వినూత్న ప్రయోగాలకు చిరునామాగా మారారు. పుష్పక విమానం సినిమాతో సంచలనం సృష్టించారు. మాటలు లేకుండా సినిమాను రూపొందించారు. రెండు జాతీయ పురస్కారాలు, ఐదు నంది అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

↗ Read the original at Eenadu

Citations · 11 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Singeetham Srinivasa Rao: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత - Eenadu

Singeetham Srinivasa Rao: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత Eenadu

17 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు మృతి..! - News18 Telugu

Singeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు మృతి..! News18 Telugu

17 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత.. - Asianet News Telugu

Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత.. Asianet News Telugu

17 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao: తీవ్ర విషాదం.. దివికేగిన సినిమా సైంటిస్ట్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు కన్నుమూత | Hindustan Times Telugu - Hindustan Times

Singeetham Srinivasa Rao: తీవ్ర విషాదం.. దివికేగిన సినిమా సైంటిస్ట్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు కన్నుమూత | Hindustan Times Telugu Hindustan Times

11 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao : మూకీ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు.. వెండితెరపై సరిహద్దులు లేని సింగీతం... - tv9telugu.com

Singeetham Srinivasa Rao : మూకీ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు.. వెండితెరపై సరిహద్దులు లేని సింగీతం... tv9telugu.com

10 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao : ఎప్పుడూ కొత్త ప్రయోగాలు... ఫ్యూచర్ జనరేషన్‌కు పాఠాలు - సింగీతానికి - ABP Desam

Singeetham Srinivasa Rao : ఎప్పుడూ కొత్త ప్రయోగాలు... ఫ్యూచర్ జనరేషన్‌కు పాఠాలు - సింగీతానికి ABP Desam

8 hours ago
80 Google News Telugu Entertainment

Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది.. - NTV Telugu

Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది.. NTV Telugu

8 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao | సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే.. నెరవేరని చివరి కల! - ntnews.com

Singeetham Srinivasa Rao | సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే.. నెరవేరని చివరి కల! ntnews.com

6 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao : సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తెలుగు సినిమా ప్రయోగశాలకు ఇక తెరపడినట్లే! - NewsBytes Telugu

Singeetham Srinivasa Rao : సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తెలుగు సినిమా ప్రయోగశాలకు ఇక తెరపడినట్లే! NewsBytes Telugu

6 hours ago
80 Google News Telugu Entertainment

Singeetham Srinivasa Rao Died: 95 ఏళ్ల వయసులో సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్... చివరి స్క్రిప్ట్ సెట్స్‌ మీదికి వెళ్లకుండానే పైలోకాలకు - Samayam Telugu

Singeetham Srinivasa Rao Died: 95 ఏళ్ల వయసులో సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్... చివరి స్క్రిప్ట్ సెట్స్‌ మీదికి వెళ్లకుండానే పైలోకాలకు Samayam Telugu

5 hours ago
79 NTV Telugu

Singeetham Srinivasa Rao- Watch Latest Videos and Audios online on Singeetham Srinivasa Rao - NTV Telugu

Singeetham Srinivasa Rao- Watch Latest Videos and Audios online on Singeetham Srinivasa Rao NTV Telugu

3 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app