janhvi kapoor: ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ.. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని ఉల్లంఘన - Eenadu
janhvi kapoor: ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ.. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని ఉల్లంఘన Eenadu
First reported 3 days ago · latest update 2 hours ago
ఇంటర్నెట్‌డెస్క్: ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ‘దేవర’లోని ‘చుట్టమల్లే...’ గీతాన్ని అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై చిత్ర పరిశ్రమ తీవ్రంగా మండిపడుతోంది. పలువురు నటీనటులు ఇలాంటి చర్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు. ‘ఇది అత్యంత నీచమైన చర్య’ అంటూ ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ సహా పలువురు నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కథానాయిక జాన్వీకపూర్ (Janhvi Kapoor) స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
‘‘ఏఐ సాంకేతికత సాయంతో మహిళలను కించపరిచేలా కంటెంట్ సృష్టించి, ప్రసారం చేయడం అత్యంత అవమానకర చర్య. ఇలాంటివి పనులు చేయడం బాధాకరం. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని తీవ్రమైన ఉల్లంఘన. చిత్ర పరిశ్రమలో ప్రతి నటి ఏదో ఒక రూపంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక మహిళకు, ఆమె శరీరానికి గౌరవం ఇవ్వడమనేది మానవత్వ విలువల్లో అత్యంత ప్రాథమికమైనది. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక మహిళ ‘వద్దు’ అని చెబితే, ఆ ‘వద్దు’ అనేదాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలి. ఒక మహిళ మినీ స్కర్ట్ ధరించిందంటే, ఆ స్కర్ట్‌వైపు కెమెరా పెట్టడానికి, అసభ్యకరంగా చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చినట్లు కాదు. అలాగే ఒక మహిళకు ఏది సౌకర్యంగా అనిపిస్తే ఆ దుస్తులు ధరిస్తుంది. తన హద్దులు ఏంటి? శరీరంతో ఏం చేయాలి? వంటివన్నీ పూర్తిగా ఆమెకు మాత్రమే సంబంధించి తీసుకునే నిర్ణయాలు’’
‘‘గత కొన్ని రోజులుగా నాకు ఎదురైన ఏఐ వీడియోల సమస్యకే ఇది పరిమితం కాదు. నా కెరీర్ మొత్తంలో నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలకు కూడా సంబంధించింది. అసలు వాస్తవం ఏంటంటే.. మహిళపై ఇబ్బందికర చూపులు, ఆమెను జడ్జ్ చేయడం, భద్రత విషయంలో రాజీపడమనడం, హద్దులు నిర్ణయించడం వంటివి ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరం. ఎప్పటినుంచో మహిళలు చుట్టూ ఉన్న ఈ భయాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి విస్తరించాయి. వాస్తవ ప్రపంచంలోనే మహిళల జీవితాలను ప్రభావితం చేస్తున్న వాటినే ఇంకా పూర్తిగా పరిష్కరించలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ కంటెంట్ రూపంలో మరో భయం వెంటాడుతోంది. దీనికి సమాధానం ‘మీ కూతురిని కాపాడుకోండి’ అని చెప్పడం మాత్రమే కాదు. తోటి కుటుంబ సభ్యుల ఆలోచనా విధానాన్ని, పెంపకాన్ని, సామాజిక పరిస్థితులను మనం మార్చాలి’’
‘‘ఏది సరైనది? ఏది తప్పో ధైర్యంగా చెప్పే పురుషులు ముందుకు రావాలి. ఈ వ్యవహారంలో వెంటనే స్పందించి స్పష్టమైన వైఖరిని వెల్లడించిన ఎన్టీఆర్ సర్‌కు ధన్యవాదాలు. లక్షల మంది అభిమానించే వ్యక్తి, తనకు నేరుగా సంబంధం లేని విషయం గురించి మాట్లాడినప్పుడు, ప్రతి మహిళకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. అలాగే చిరంజీవి సర్, విజయ్, ఖుష్బూ మేడమ్ ఇలాంటి అనైతిక చర్యలను ఖండిస్తూ మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి పరిణామాల విషయంలో ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నా. ఒక మహిళను కేవలం మనిషిగా చూడాలని, గౌరవించాలని కోరుకోవడం నిజంగా అంత పెద్ద కోరికా?’’ అని జాన్వీకపూర్ పోస్ట్ పెట్టారు.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
janhvi kapoor: ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ.. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని ఉల్లంఘన - Eenadu
janhvi kapoor: ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ.. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని ఉల్లంఘన Eenadu
3 days agoJanhvi Kapoor: ఆ నీచులు చేసింది లైగిక వేధింపులకు తక్కువేం కాదు - TV9 Telugu
Janhvi Kapoor: ఆ నీచులు చేసింది లైగిక వేధింపులకు తక్కువేం కాదు TV9 Telugu
2 hours agoJanhvi Kapoor | జాన్వీ కపూర్‌కు ఖుష్బూ సుందర్ మద్దతు - prabhanews.com
Janhvi Kapoor | జాన్వీ కపూర్‌కు ఖుష్బూ సుందర్ మద్దతు prabhanews.com
3 days ago