IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..? - tv9telugu.com
IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..? tv9telugu.com
First reported 2 days ago · latest update 1 day agoIndia vs West Indies T20I: వన్డే సిరీస్ ముగిసింది. ఇక వెస్టిండీస్ జట్టుతో రేపటి నుంచి పొట్టి ఫార్మాట్‌లో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లక్నోలో మొదలుకానుంది. ఈక్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. జస్ర్పీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరో ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేస్ దళానికి నాయకుడిలా మారనున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గేమ్స్ టీంలో అర్షదీప్ చోటు దక్కించుకున్నా.. అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ ప్లేస్ పక్కా అని తెలుస్తోంది. అర్షదీప్‌తోపాటు ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్‌లలో ఒకరికి ఛాన్స్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, మరో ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి మాత్రం ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే, ఏషియన్స్ గేమ్స్ ఫైనల్లో పాక్ జట్టుపై ఈ స్పిన్నర్ 3 ఓవర్లు వేసి ఏకంగా 44 పరుగులు సమర్పించుకుని, వికెట్ పడగొట్టలేకపోయాడు. రవి బిష్ణోయ్‌పై వేటు పడేలా కనిపిస్తోంది. అలాగే, కుల్దీప్ యాదవ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్న తరుణంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఈ చైనామన్ బౌలర్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఓపెనర్స్ ప్లేస్‌కు తీవ్రమైన పోటీ ఏర్పడింది. సంజూ శాంసన్ లేదా వైభవ్ సూర్యవంశీలలో ఎవరు ఓపెనర్‌గా బరిలోకి దిగుతారనేది చూడాలి. ఏషియన్ గేమ్స్‌లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్‌నే ఓపెనర్‌గా పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, గంభీర్ మాత్రం సంజూ శాంసన్ వైపు ఉంటాడని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..? - tv9telugu.com
IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..? tv9telugu.com
2 days agoIND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..? - tv9telugu.com
IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..? tv9telugu.com
2 days agoIND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..! - NTV Telugu
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..! NTV Telugu
1 day ago