T.A.M · The Air Media
← Back to live feed
Weightage 88 3 outlets citing Technology IN

Amazon Great Indian Festival: రేపట్నుంచే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్.. ఆఫర్ల వివరాలు ఇవే - Eenadu

Amazon Great Indian Festival: రేపట్నుంచే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్.. ఆఫర్ల వివరాలు ఇవే Eenadu

First reported 2 days ago · latest update 1 hour ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఇంటర్నెట్‌ డెస్క్: పండగ ఆఫర్లతో వినియోగదారులను అలరించేందుకు ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) సిద్ధమైంది. గురువారం నుంచి ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ 2026’ ప్రారంభం కానుంది (Amazon Great Indian Festival). రాత్రి 12 గంటల నుంచే సేల్‌ మొదలుకానుంది. స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, స్మార్ట్‌టీవీ, రిఫ్రిజిరేటర్లపై అమెజాన్‌ డిస్కౌంట్లు ప్రకటించింది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా 5జీ ప్రధాన ఆకర్షణంగా నిలుస్తోంది. బేస్‌ వేరియంట్‌ను రూ.84,999 (కూపన్‌ ఆఫర్‌తో పాటు)కు కొనుగోలు చేయొచ్చు. లిస్టింగ్‌ ధర ప్రస్తుతం రూ.99,999గా ఉంది. 9 నెలల పాటు నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఐఫోన్‌ 16పై కూడా ఆఫర్‌ ప్రకటించింది. లిస్టింగ్‌ ధర రూ.89,900 కాగా.. డిస్కౌంట్‌ అనంతరంరూ.71,999కు లభిస్తుంది.

మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 ధర ప్రస్తుతం రూ.52,999 ఉండగా.. రూ.42,999కు విక్రయించనుంది. ఆరు నెలల నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. షావోమీ 17పై ఏకంగా 50 శాతం వరకు ఆఫర్‌ ఉంది. లిస్టింగ్‌ ధర రూ.1,19,999 ఉండగా.. రూ.59,999కు కొనుగోలు చేయొచ్చు. వన్‌ప్లస్, రెడ్‌మీ, లావా వంటి స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. నో-కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజీ, కూపన్‌ ఆఫర్లు అందిస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది.

హోం అప్లయన్సెస్‌పై 65 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో శాంసంగ్‌, హైయర్‌, ఎల్‌జీ, గోద్రేజ్‌ తదితర కంపెనీలకు చెందిన వాషింగ్‌ మెషిన్స్‌, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్స్‌ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. గ్రేట్‌ డీల్స్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, నోకాస్ట్‌ ఈంఎంఐ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

స్మార్ట్‌టీవీ, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. శాంసంగ్‌, షావోమి, టీసీఎల్‌, ఎల్‌జీ తదితర కంపెనీల ఉత్పత్తులు ఉన్నాయి. వీటి ధరలు రూ.7999 నుంచి ప్రారంభమవుతాయి. అమెజాన్‌ ఫ్రెష్‌ డీల్ ద్వారా 60 శాతం వరకు, అమెజాన్‌ బ్రాండ్స్‌లో 80 శాతం వరకు, విమాన టికెట్లపై 23 శాతం వరకు ఆదా చేయొచ్చని అమెజాన్‌ తెలిపింది. బుక్స్‌ అండ్‌ టాయ్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు పేర్కొంది.

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Amazon Great Indian Festival: రేపట్నుంచే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్.. ఆఫర్ల వివరాలు ఇవే - Eenadu

Amazon Great Indian Festival: రేపట్నుంచే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్.. ఆఫర్ల వివరాలు ఇవే Eenadu

1 hour ago
80 Google News Telugu Technology

Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..! - NTV Telugu

Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..! NTV Telugu

2 days ago
80 Google News Telugu Entertainment

Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్ - Asianet News Telugu

Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్ Asianet News Telugu

1 day ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app