T.A.M · The Air Media
← Back to live feed
Weightage 96 3 outlets citing Sports IN

Virat Kohli's team denies reports of paying Rs 5 crore for ashram visit

Virat Kohli's team has officially denied viral reports claiming that the cricketer paid Rs 5 crore to visit an ashram in Vrindavan. Media outlets report that these claims are baseless and have been refuted by those representing the athlete.

First reported 9 hours ago · latest update 7 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో బృందావనంలోని ప్రేమానంద మహారాజ్‌ ఆశ్రమాన్ని (రాధా కేలీ కుంజ్‌ ఆశ్రమం) సందర్శించినందుకుగానూ స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి రూ.5 కోట్లు చెల్లించినట్లు కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి (Premanand Maharaj Ashram). దీనిపై కోహ్లీ టీమ్‌ స్పందించింది. ఆ కథనాలను ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్‌ న్యాస్ ఫలహారి మహారాజ్ (దినేశ్ శర్మ) చేసిన వ్యాఖ్యలతో ఈ చెల్లింపు ప్రచారం మొదలైంది. తన పాపులారిటీని పెంచుకునేందుకు ప్రేమానంద మహారాజ్.. కోహ్లీ (Virat Kohli)కి డబ్బులు చెల్లించి, ఆశ్రమానికి రప్పించారని ఆరోపణలు చేశారు. దీనిపై కోహ్లీ బృందం తీవ్రంగా స్పందించింది. ‘‘ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. వాటిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. తనకున్న ప్రగాఢ విశ్వాసం, గౌరవం కారణంగానే ప్రేమానంద మహారాజ్‌జీ ఆశ్రమాన్ని విరాట్‌ సందర్శిస్తుంటారు. ఈ తరహా వ్యాఖ్యలను ప్రచురించే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాను కోరుతున్నాం’’ అని పేర్కొంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తరచూ ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు.

ప్రేమానంద మహారాజ్ ఆశ్రమం వివాదాస్పద అంశాలతో నిలవడం ఇదే తొలిసారి కాదు. ఆయన శిష్యుడు రసిక్ దులారీ ఇటీవల భవనంపై నుంచి పడి, అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

↗ Read the original at Eenadu

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Virat Kohli: ఆశ్రమ సందర్శన కోసం రూ.5 కోట్లు అంటూ ప్రచారం.. స్పందించిన విరాట్‌కోహ్లీ - Eenadu

Virat Kohli: ఆశ్రమ సందర్శన కోసం రూ.5 కోట్లు అంటూ ప్రచారం.. స్పందించిన విరాట్‌కోహ్లీ Eenadu

7 hours ago
80 Google News Telugu Sports

Virat Kohli: కోహ్లీని బృందావనం రప్పించడానికి రూ.5 కోట్లు.. వైరల్ అవుతోన్న వార్తల్లో నిజమెంత ? - TV9 Telugu

Virat Kohli: కోహ్లీని బృందావనం రప్పించడానికి రూ.5 కోట్లు.. వైరల్ అవుతోన్న వార్తల్లో నిజమెంత ? TV9 Telugu

9 hours ago
79 NTV Telugu

Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిదంటే..? - NTV Telugu

Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిదంటే..? NTV Telugu

8 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app