Reports of Actor Nana Patekar's Death
Multiple Telugu news outlets have reported the death of actor Nana Patekar. Some reports also highlighted his personal interests in cricket and recent public comments regarding mortality.
First reported 9 hours ago · latest update 3 hours ago
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు (Nana Patekar Passed Away). గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నానా పటేకర్ (Nana Patekar) మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా (Nana Patekar Death Reason)ఆయన మరణించినట్లు తెలిపారు. నటుడిని కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. పటేకర్ మృతిపై పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలియనున్నాయని పోలీసులు వెల్లడించారు (Nana Patekar Death News).
నానా పటేకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కాలా’ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే, తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘బొమ్మలాట్టమ్’ సినిమా తెలుగులో ‘రాణా’ పేరుతో డబ్ అయ్యింది. ఇందులో అర్జున్, కాజల్ అగర్వాల్‌తో పాటు నానా పటేకర్ (Veteran Actor Nana Patekar)ముఖ్య పాత్ర పోషించారు.
కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా నానా పటేకర్.. మీకీ ఆసక్తికర విషయం తెలుసా?
1951లో జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. 1978లో ‘గమన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. తన కెరీర్‌లో మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. ‘క్రాంతి వీర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా, పరిందా, అగ్నిసాక్షి చిత్రాలకు ఉత్తమ సహయనటుడిగా జాతీయ అవార్డు దక్కింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ 2013లో కేంద్రం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అదే ఏడాది మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం రాజ్‌కపూర్ ప్రత్యేక సహకార అవార్డును ప్రదానం చేసింది.
నానాపటేకర్ 1978లో మరాఠీ సినీ నటి, నిర్మాత నీలకంఠిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. ఒక అబ్బాయి పుట్టిన రెండు సంవత్సరాలకే అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. మరో అబ్బాయి మల్హర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అతనికి నటనపైనా ఆసక్తి ఉంది.
Citations · 4 reports from 4 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత - Eenadu
Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత Eenadu
9 hours agoNana Patekar : రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. మృత్యువు గురించి మూడు రోజుల ముందే మాట్లాడిన నానా.. - TV9 Telugu
Nana Patekar : రేపు నేను ఉంటానో లేదో తెలియదు.. మృత్యువు గురించి మూడు రోజుల ముందే మాట్లాడిన నానా.. TV9 Telugu
3 hours agoNana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత - Samayam Telugu
Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత Samayam Telugu
8 hours agoNana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..! - NTV Telugu
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..! NTV Telugu
7 hours ago