Nana Patekar: ‘రేపు నేను ఉంటానో లేదో’: మూడు రోజుల ముందే మరణంపై నానా పటేకర్ వ్యాఖ్యలు - Eenadu
Nana Patekar: ‘రేపు నేను ఉంటానో లేదో’: మూడు రోజుల ముందే మరణంపై నానా పటేకర్ వ్యాఖ్యలు Eenadu
First reported 22 hours ago · latest update 10 hours ago
ఇంటర్నెట్ డెస్క్: సినీ నటుడు నానా పటేకర్ (Nana Patekar) ఇక లేరన్న వార్త అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే, ఆయన కన్నుమూయడానికి మూడు రోజుల ముందు ‘మరణం’ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. స్నేహితులతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నానాజీ.. ‘రేపు నేను ఉంటానో లేదో తెలియదు’ అని అన్నారు.
అక్టోబర్ 4న గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి నానా పటేకర్ హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో నానాజీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘‘మనందరం ఏదో ఒక రోజు వెళ్లిపోవాల్సిందే. రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సమయం వస్తుంది. కానీ ఆరోజు రాకముందే మనం కొన్ని ఆలోచించుకోవాలి. ‘నేను చేయాలనుకున్నది చేయగలిగానా? నా లక్ష్యం దిశగా ప్రయత్నించానా?’ అనేది ఎప్పుడూ పరిశీలించుకోవాలి’’ అని నానా పటేకర్ అన్నారు (Nana Patekar's Last words). జీవితమంతా సాధించాలనే తపనతో ఉండాలని ఆయన చెప్పారు. ఇది జరిగిన మూడు రోజులకే ఆయన హఠాత్తుగా మరణించడం అభిమానులను మరింత కలచివేస్తోంది.
మరణం అంటే నానాజీ ఎప్పుడూ భయపడలేదు. తన దహన సంస్కారాల కోసం కట్టెలు కూడా దాచినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఏదో ఒకరోజు నేను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతాను. నా అంత్యక్రియల కోసం 12 మణుగుల కట్టెలు దాచాను. అవే నా చివరి ఆస్తి. వాటితోనే నన్ను దహనం చేయండి. దహనం చేసే ముందు వాటిని ఎండబెట్టండి. ఎందుకంటే తడివి ఉపయోగిస్తే అంత్యక్రియలకు వచ్చిన నా స్నేహితులకు ఆ పొగ వల్ల కన్నీళ్లు వస్తాయి’’ అని చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన గుర్తులుగా మిగిలిపోయాయి.
తెరపై అలరించే నానాజీకి క్రికెట్ అంటే ఇష్టం. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని. కోహ్లీ ఔట్ అయినప్పుడు తనకు భోజనం చేయాలనిపించేది కాదని పటేకర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Citations · 4 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Nana Patekar: ‘రేపు నేను ఉంటానో లేదో’: మూడు రోజుల ముందే మరణంపై నానా పటేకర్ వ్యాఖ్యలు - Eenadu
Nana Patekar: ‘రేపు నేను ఉంటానో లేదో’: మూడు రోజుల ముందే మరణంపై నానా పటేకర్ వ్యాఖ్యలు Eenadu
18 hours agoNana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే - Asianet News Telugu
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే Asianet News Telugu
22 hours agoLegendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం - ABP Desam
Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం ABP Desam
18 hours agoNana Patekar: నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. బాలీవుడ్ నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం - TV9 Telugu
Nana Patekar: నానా పటేకర్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు.. బాలీవుడ్ నటిపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం TV9 Telugu
10 hours ago