Ravindra Jadeja Posts Social Media Commentary Following Agarkar's Tenure
Following the conclusion of Ajit Agarkar's tenure as BCCI chief selector, cricketer Ravindra Jadeja shared a post on social media. Reports describe the post as satirical and note public speculation regarding Jadeja's interest in the selection process.
First reported 8 hours ago · latest update 2 hours ago
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం అక్టోబర్ 4తో ముగిసింది. ఆ వెంటనే బీసీసీఐ కూడా సెలక్టర్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్తగా రాబోయే వ్యక్తిని బట్టి తదుపరి చీఫ్ సెలక్టర్ ఎంపిక ఉండబోతోంది. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆసక్తికర పోస్టు పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది.
బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం పోస్టును షేర్ చేసిన జడ్డూ (Ravindra Jadeja).. ‘ప్రాసెస్ ఏంటి?’ అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీని జోడించాడు. దీంతో ఆ పోస్టుకు రవీంద్ర జడేజా ఏమైనా అప్లై చేసుకుంటాడా? అనే కామెంట్లు వస్తున్నాయి. రెండేళ్ల కిందట రవీంద్ర జడేజాను కొన్ని వన్డే సిరీస్‌లకు అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. అప్పుడు వీరిద్దరి మధ్య సంబంధాలు చెడినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జడేజా తాజా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు భువనేశ్వర్ కుమార్‌ను (Bhuvneswar Kumar) తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవడంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆలస్యంగానైనా ఎంపిక చేయడం మంచి నిర్ణయం. అద్భుతమైన ప్రదర్శన చేసినా.. ఇంతకాలం అతడిని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకు అతడిని పక్కన పెట్టారని చాలాసార్లు అనుకున్నా. ఐపీఎల్‌తోపాటు యూపీ టోర్నీలోనూ సూపర్‌గా ఆడాడు. వయసు అనే కారణాన్ని పక్కన పెట్టాలి. కుర్రాళ్లు ఉన్నారని చెప్పి.. అనుభవం కలిగిన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. మొత్తం యంగ్ టీమ్‌తో ఆడాలనుకోవడం సరికాదు. యువ, సీనియర్ ఆటగాళ్ల కలయికతో జట్టు నిర్మాణం ఉండాలి. షమీని కూడా తీసుకోవాలి. సిరాజ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. గుర్నూర్, ప్రసిద్ధ్ వంటి కుర్రాళ్లను ఆడించినా మేనేజ్‌మెంట్‌కు ఇంకా నమ్మకం రావడం లేదు. సిరాజ్‌కు నిలకడగా ఛాన్స్ ఇవ్వడం లేదు. షమీని వన్డే జట్టులోకి తీసుకోవాలి. బుమ్రా, షమీ, సిరాజ్.. త్రయంతో వరల్డ్ కప్‌లో భారత్‌కు మెరుగైన అవకాశాలు ఉంటాయి’’ అని జాఫర్ (Waim Jaffer) అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Ravindra Jadeja: అగార్కర్ పదవీకాలం ముగింపు.. జడేజా ఆసక్తికర పోస్ట్ - Eenadu
Ravindra Jadeja: అగార్కర్ పదవీకాలం ముగింపు.. జడేజా ఆసక్తికర పోస్ట్ Eenadu
7 hours agoRavindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ - ABP Desam
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ABP Desam
2 hours agoRavindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..! - NTV Telugu
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..! NTV Telugu
8 hours ago