T.A.M · The Air Media
← Back to live feed
Weightage 80 3 outlets citing Entertainment IN

Vijay Deverakonda: నాపై ఏం జరుగుతుందో అర్థమవడానికి ఏడేళ్లు పట్టింది: విజయ్‌ దేవరకొండ - Eenadu

Vijay Deverakonda: నాపై ఏం జరుగుతుందో అర్థమవడానికి ఏడేళ్లు పట్టింది: విజయ్‌ దేవరకొండ Eenadu

First reported 2 days ago · latest update 14 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Eenadu Authority 86

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘నా కలలు.. నా శ్రమ వాళ్లకు అనవసరం అనిపిస్తే నేనెందుకు ఆగాలి? నా నిజాయతీ వాళ్లకు అహంకారంలా అనిపిస్తే నేనెందుకు నటించాలి? నా మీద నాకున్న నమ్మకం వాళ్లకు బలుపుగా అనిపిస్తే నేనెందుకు తగ్గాలి? నా సినీ ప్రయాణం వాళ్లకు అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? మారాల్సింది నేను కాదు. వాళ్లు.. బాగుపడాల్సింది వాళ్లు..’’ అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి సూటి ప్రశ్నలు వేశారు విజయ్‌ దేవరకొండ. (Vijay Deverakonda) ఆయన కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. (Ranabaali) రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్‌ విడుదల వేడుకలో విజయ్‌ మాట్లాడారు.

‘‘నాపైనా, నా సినిమాల పైనా జరుగుతున్న దాన్ని విద్వేషం అనలేం. ఎందుకంటే పనిగట్టుకొని కొన్ని గ్రూపులు పోస్ట్‌లు పెడుతున్నాయి. సోషల్‌మీడియాలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అందులో తప్పు లేదు. కానీ, కొందరు ఓ 50 అకౌంట్లు పెట్టుకుని, అన్నింటిలోనూ ఒకే పోస్ట్‌ పెడతారు. ‘తెలుగు సినిమా అయిన ‘రణబాలి’ కాకుండా మనం ‘జైలర్‌2’కు పోదాం’’ అని సడెన్‌గా 50 అకౌంట్స్‌ నుంచి ఒకే రీల్‌ షేర్‌ అవుతుంది. అందరూ ఒకే అభిప్రాయాన్ని రీల్‌గా షేర్‌ చేస్తున్నారంటే ఎవరో కూర్చొని డబ్బులు పెట్టి మరీ చేయిస్తున్నారని అర్థం. వ్యవస్థ అలా తయారైంది. దీన్ని మనం ఆపలేం’’

‘‘ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేయిస్తున్న వాడు రేపు ఏఐతో ఆ పనిచేయిస్తాడు. అప్పుడు ఈ పనిచేసే వాళ్లు ఏం చేస్తారు?సినిమాను ప్రచారం చేయడానికి నేను సపోర్ట్‌ చేస్తా. ఎవరో ఒకరు బాగుపడతారు. అదే టూల్‌ను ఒకరిని కిందకు లాగడానికి ఉపయోగిస్తే ‘ఎందుకురా ఈ పనులు?’ అనిపిస్తుంది. ఇలా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నాకు ఏడేళ్లు పట్టింది. నేను ఖాళీ చేతులతో వచ్చి, నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఏడేళ్ల నుంచి అర్థం కాలేదు. గత ఏడాది ఈ విషయంలో స్పష్టత వచ్చింది. నాకు ఏం జరుగుతుందో అర్థమైంది’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘మనకు ఏ చరిత్ర తెలియకుండా ఉంచాలనుకున్నారో, ఏ వీరుల పేర్లు తెలియకూడదనుకున్నారో ఆ చరిత్రను అక్టోబరు 16న కరెక్ట్‌ చేసే ప్రయత్నం ‘రణబాలి’. ఆ వీరులకు ఇచ్చే అసలైన గౌరవమిది. మీరంతా ‘రణబాలి’ ప్రపంచంలోకి వెళ్తారు. ఇది మైండ్‌ బ్లోయింగ్‌ సబ్జెక్ట్‌. ఇందులో పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా రావడం నా అదృష్టం. మనకు రాసిపెట్టి ఉన్న కథలు మన దగ్గరికి వస్తాయి. నా, రష్మిక ఫిల్మోగ్రఫీలో ఇదొక అంకంగా మిగిలిపోతోందని నమ్ముతున్నా. మీరు మీ కుటుంబంతో సహా ఈ దసరాకు ‘రణబాలి’ చూడండి. మీ పిల్లలకూ చూపించండి’’ అని విజయ్‌ కోరారు.

‘‘రణబాలి’ పాత్రలో విజయ్‌ తప్ప మరొకరు నాకు కనిపించలేదు. ఇది నాలుగేళ్ల ప్రయాణం. రెండేళ్ల రీసెర్చ్‌. మరో రెండేళ్లు ప్రొడక్షన్‌ చేశాం. ఇది 150ఏళ్ల కిందట జరిగిన కథ. మన పూర్వీకులు అందరూ దీన్ని అనుభవించారు. కేవలం ఆహారం లేని కారణంగా మనలాంటి కుటుంబాలు ఎన్నో చనిపోయాయి. ఆ కథ విన్నప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం, ఆవేశం నుంచి పుట్టిన కథే ‘రణబాలి’. తారకాసుర సంహారంలో రణబాలీశ్వరుడిగా మారతాడు కుమారస్వామి. యుద్ధానికి ముందు రణబాలి అవతారం ఎత్తుతాడు. ఆయన్ను రణబాలి మురుగన్‌ అంటారు. దానినుంచే ఈ మూవీకి ఈ పేరు పెట్టాం’’ అని రాహుల్‌ వివరించారు. విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి అని, నెగెటివ్‌గా చూడొద్దని నిర్మాత మైత్రి రవి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

↗ Read the original at Eenadu

Citations · 6 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

86 Eenadu ★ most authoritative citation

Vijay Deverakonda: నాపై ఏం జరుగుతుందో అర్థమవడానికి ఏడేళ్లు పట్టింది: విజయ్‌ దేవరకొండ - Eenadu

Vijay Deverakonda: నాపై ఏం జరుగుతుందో అర్థమవడానికి ఏడేళ్లు పట్టింది: విజయ్‌ దేవరకొండ Eenadu

2 days ago
80 Google News Telugu Entertainment

Vijay Deverakonda: అప్పటివరకూ నా సినిమాలకు టికెట్‌ ధర పెంచనవసరం లేదు: విజయ్‌ దేవరకొండ - Eenadu

Vijay Deverakonda: అప్పటివరకూ నా సినిమాలకు టికెట్‌ ధర పెంచనవసరం లేదు: విజయ్‌ దేవరకొండ Eenadu

19 hours ago
80 Google News Telugu Entertainment

Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం! - NTV Telugu

Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం! NTV Telugu

18 hours ago
80 Google News Telugu Entertainment

Vijay Deverakonda: ఇకపై నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచను.. ఆ ఒక్కటి త‌ప్ప‌: విజయ్ దేవరకొండ - Vaartha Telugu

Vijay Deverakonda: ఇకపై నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచను.. ఆ ఒక్కటి త‌ప్ప‌: విజయ్ దేవరకొండ Vaartha Telugu

16 hours ago
80 Google News Telugu Entertainment

Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌ - Asianet News Telugu

Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌ Asianet News Telugu

14 hours ago
79 NTV Telugu

Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు - NTV Telugu

Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు NTV Telugu

18 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app